బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన టాప్ స్టార్ మూవీస్ ఎలక్షన్స్ కారణంగా పోస్ట్ పోన్ అవ్వగా వాటి ప్లేస్ లో ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ అయిన మూవీ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ది ఫ్యామిలీ స్టార్(The Family Star) మూవీ…
పెద్ద సినిమా ప్లేస్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అవ్వగా సమ్మర్ అడ్వాంటేజ్, ఉగాది హాలిడే అలాగే రంజాన్ హాలిడేలు కూడా ఉన్నప్పటికీ ఈ సినిమా వాటి అడ్వాంటేజ్ ను ఏమాత్రం వాడుకోలేక పోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ భారీ ఎత్తున తరలి వస్తారు అని టీం ఎంత నమ్మినా కూడా…
సినిమాకి వచ్చిన మిక్సుడ్ టాక్ ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది. దాంతో బడ్జెట్ పరంగా రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది అని చెప్పొచ్చు ఈ సినిమాను. ఇక సినిమాను కొన్ని చోట్ల ఓన్ గా రిలీజ్ చేసినా కూడా కొన్ని చోట్ల భారీ రేట్లకే అమ్మగా కొన్ని ప్రతీ ఏరియలో కూడా….
సినిమాకి భారీ నష్టాలు రావడంతో సినిమాను కొన్న వాళ్ళు అందరూ కూడా దిల్ రాజుని కలిసి నష్టపరిహారం కోసం అడగగా వాళ్ళని ఆదుకోవడానికి సిద్ధం అయిన దిల్ రాజు కొన్న రేట్లలో కొంత వరకు రిటర్న్ ఇవ్వడానికి సిద్ధం అవ్వగా హీరో విజయ్ దేవరకొండని అలాగే డైరెక్టర్ ను కూడా డబ్బులు రిటర్న్ ఇవ్వాలని కోరాడట.
హీరో విజయ్ దేవరకొండ తన రెమ్యునరేషన్ నుండి కొంత భాగాన్ని రిటర్న్ ఇవ్వడానికి ఓకే చెప్పారని అంటున్నారు. మొత్తం మీద విజయ్ దేవరకొండకి మంచి కంబ్యాక్ మూవీగా నిలుస్తుంది అనుకున్న ఫ్యామిలీ స్టార్ మూవీ ఇలా భారీ నష్టాలతో అందరినీ కూడా తీవ్రంగా నిరాశ కలిగించే రిజల్ట్ ను సొంతం చేసుకుని షాకిచ్చింది.