Home న్యూస్ 100 కోట్ల వైపు పుష్ప విలన్ మూవీ…కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ఇది!

100 కోట్ల వైపు పుష్ప విలన్ మూవీ…కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం ఇండియాలో వరుస విజయాలతో ఫుల్ ఫామ్ తో దూసుకు పోతున్న ఇండస్ట్రీ మలయాళ ఇండస్ట్రీ. వరుస పెట్టి బ్లాక్ బస్టర్స్ ను సొంతం చేసుకుంటూ ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ మార్క్ లను అవలీలగా అందుకుంటూ ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా మేజర్ మూవీస్ అన్నీ కూడా…

సక్సెస్ లను అందుకుంటూ ఉండగా రీసెంట్ గా మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప(Pushpa Part 1) లో విలన్ గా చేసి తెలుగు వారికి చేరువ అయిన మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil) నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం(Aavesham Movie) సినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…

కలెక్షన్స్ పరంగా సూపర్ స్ట్రాంగ్ గా దూసుకు పోతున్న ఈ సినిమా 9 రోజుల్లో కేరళలో 31.50 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంటే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 8.50 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది…ఇక ఓవర్సీస్ లో సినిమా 33.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఓవరాల్ గా సినిమా…

9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 73.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో 100 కోట్ల గ్రాస్ మార్క్ వైపు దూసుకు పోతుంది..వరుస పెట్టి 100 కోట్ల గ్రాస్ మూవీస్ తో రచ్చ లేపుతున్న మలయాళ ఇండస్ట్రీ నుండి ఇప్పుడు మరో…

100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకునే మూవీగా ఆవేశం సినిమా నిలవనుండగా ఫహాద్ ఫాజిల్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా తన కెరీర్ లో మొట్ట మొదటి 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న మూవీగా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది. త్వరలోనే ఈ సినిమా తెలుగు లో కూడా డబ్ కానుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here