Home న్యూస్ 70 కోట్ల కాంబో….కానీ రికార్డ్ కొట్టని ఫ్యామిలీ స్టార్!

70 కోట్ల కాంబో….కానీ రికార్డ్ కొట్టని ఫ్యామిలీ స్టార్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర గీత గోవిందం(Geetha Govindam) లాంటి సెన్సేషనల్ హిట్ కొట్టిన యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) పరశురాం(Parasuram) ల క్రేజీ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా….

గీత గోవిందం లాంటి 70 కోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ళ కాంబోలో మూవీ అంటే కచ్చితంగా ఓపెనింగ్స్ నుండే రికార్డుల దుమ్ము దులిపేయడం ఖాయమని అందరూ అనుకున్నారు, మేకర్స్ కూడా భారీ లెవల్ లో సినిమాను రిలీజ్ చేశారు. ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ కెరీర్ లో రికార్డ్ లెవల్ లో సినిమా రిలీజ్ అయింది…

కానీ ప్రీమియర్స్ కి అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ని ఏమి క్రియేట్ చేయలేక పోయింది. ఓవరాల్ గా ప్రీమియర్స్ కి సినిమా అక్కడ $282,688 From 333 Locations కలెక్షన్స్ ని మాత్రమే సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో రికార్దులు నమోదు చేస్తుంది అనుకున్నా కూడా…..

ఓవరాల్ గా విజయ్ దేవరకొండ కెరీర్ లో టాప్ 5 ఓపెనర్ గా నిలిచి షాకిచ్చింది సినిమా…. ఒకసారి విజయ్ దేవరకొండ కెరీర్ లో టాప్ ప్రీమియర్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే… 
#VijayDeverakonda’s Top-5 Premier Grossers in USA
Liger : $504K
Kushi : $474K
GeethaGovindam : $403K
Dear Comrade : $310K
The Family Star : $283K****

మొత్తం మీద సమ్మర్ లో క్రేజీ మూవీగా రిలీజ్ అయినా కూడా అది ఫ్యామిలీ స్టార్ అంచనాలను పూర్తిగా అందుకోలేదు… ఇక లాంగ్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్సీస్ లో ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపించి బిజినెస్ ను రికవరీ చేస్తుందో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here