2019 లో జరిగిన ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ భారీ షాక్ ఇచ్చేలా అట్టర్ ఫ్లాఫ్ అయిన విషయం తెలిసిందే, 2014 లో బంపర్ మెజారిటీ తో గెలిచినా 2019 కి వచ్చే సరికి వై ఎస్ ఆర్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం తో తెలుగు దేశం ఓటమి కన్ఫాం అయ్యింది. చంద్రబాబు నాయుడు గెలిచినా ఫ్యూచర్ సిఎం గా చెప్పుకున్న చినాబాబు లోకేష్ ఒడి పోవడం తో ఇప్పుడు తెలుగు దేశం భవితవ్యం ఏంటి అనేది అందరి లోను ఆసక్తిని రేపుతుంది.
ఇలాంటి సమయం లో సోషల్ మీడియా లో ఒక పేరు గట్టిగా వినిపిస్తుంది, అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు, తెలుగు దేశం మళ్ళీ గాడిలో పడాలి అంటే పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ చేతిలో పెట్టాలి అంటూ ఫ్యాన్స్ లో ఎక్కువ మంది ఎన్టీఆర్ ని రాజకీయాల్లో రావాలని కోరుకుంటూ మెసేజ్ లు చేస్తున్నారు.
మరో పక్క ఎన్టీఆర్ ఇప్పట్లో వచ్చే చాన్స్ లేదు కానీ మరో 10- 15 ఏళ్ల తర్వాత రావాలని చూస్తున్నట్లు సమాచారం, అప్పటికి పార్టీ తేరుకోక పోతే కష్టం అని విశ్లేషకులు చెబుతున్నారు, సినిమాలతో హ్యాప్పీ గా ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం ఇతర సినీ హీరోల పొలిటికల్ రిజల్ట్స్ చూసి ఇప్పట్లో రావడానికి ఏమాత్రం ఇష్ట పడడని కూడా చెబుతున్నారు.