రేసింగ్ నేపధ్యంలో కళ్ళు మిరుమిట్లుగొలిపే యాక్షన్ సీన్స్ తో ఆడియన్స్ ను అలరించే సినిమా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్…ఈ సిరీస్ లో ఇప్పటికి 9 పార్టులు రాగా 10వ పార్ట్ నుండి క్లైమాక్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఫాస్ట్ X మూవీ వరల్డ్ వైడ్ గా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయింది. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
స్టొరీ పాయింట్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియాస్ 5th పార్ట్ లో ఒక వాల్ట్ లో ఉన్న మనీ ని హీరోలు దక్కించుకునే క్రమంలో ఒక బిజినెస్ మ్యాన్ చనిపోతాడు. తన కొడుకు హీరో ఫ్యామిలీని మొత్తం చంపేస్తానని బెదిరిస్తే… హీరో ఎలా ఆ విలన్ ని ఫేస్ చేశాడు అన్నది సినిమా కథ… ఇది సినిమా సిరీస్ కి ఎండ్ పార్ట్స్ కాబట్టి ఈ పార్ట్ ని కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ముగించారు…
కథ పాయింట్ చాలా చాలా నార్మల్ గా ఉంటుంది ఈ సినిమాలో కూడా, కానీ సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్ లెంత్ ఎక్కువ అయినా సరే… ఎక్కడా కూడా ఏమాత్రం బోర్ కొట్టించకుండా తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆసక్తిని పెంచేస్తూ ఒకటి తర్వాత ఒకటి యాక్షన్ సీన్స్ మెప్పించడంతో ఆ పార్ట్ మొత్తం బాగా ఇంప్రెస్ చేస్తుంది.
యాక్షన్ పార్ట్ కాకుండా మిగిలిన కథ మాత్రం చాలా నెమ్మదిగా సాగినా యాక్షన్ పార్ట్ మాత్రం బాగుండటంతో టైం ఇట్టే గడిచిపోయి సినిమా క్లైమాక్స్ కి వచ్చేస్తాం. ఇక క్లైమాక్స్ లో కొన్ని ఊహించని ట్విస్ట్ లు జరగగా పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా అదిరిపోయింది. దాంతో ఓవరాల్ గా స్టొరీ కొంచం వీక్ అనిపించినా కానీ యాక్షన్ పార్ట్…
అండ్ భారీ స్టార్ కాస్ట్ హెల్ప్ తో సినిమా మంచి టైం పాస్ మూవీలా అనిపించింది…. విన్ డీసెల్, జాన్ సీన, జాసన్ మొమో ఇలా అందరూ కూడా మెప్పించారు. ఆక్వామాన్ హీరో జాసన్ మొమో ఇందులో డిఫెరెంట్ విలనిజంతో మెప్పించడంతో రొటీన్ మూవీనే అయినా కూడా సినిమా ఎంగేజింగ్ గా సాగింది…
ఓవరాల్ గా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లవర్స్ కి మరోసారి ఈ పార్ట్ కూడా మెప్పించడం ఖాయం, ఇక రెగ్యులర్ ఆడియన్స్ కథ పెద్దగా లేక పోయినా యాక్షన్ పార్ట్, కొంచం కామెడీ… కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ కోసం ఈజీగా ఒకసారి చూసేలా ఈ సినిమా ఉందని చెప్పాలి… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.