Home న్యూస్ ఫాస్టెస్ట్ 100K లైక్స్ సాంగ్స్….రికార్డ్ కొట్టని పుష్ప2 ఫస్ట్ సాంగ్!

ఫాస్టెస్ట్ 100K లైక్స్ సాంగ్స్….రికార్డ్ కొట్టని పుష్ప2 ఫస్ట్ సాంగ్!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అయిన పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie) ఈ ఇయర్ రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ లో ముందు నిలిచే సినిమా అని చెప్పాలి. భారీ హైప్ నడుమ వస్తున్న ఈ సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి అని చెప్పాలి.

సినిమా నుండి వచ్చే ఏ కంటెంట్ అయినా రికార్డుల ఊచకోత కోస్తుందని అందరూ అనుకోవడం ఖాయం, సినిమా అఫీషియల్ గ్లిమ్స్ కానీ టీసర్ కానీ సాలిడ్ గా జోరు చూపించి రచ్చ లేపగా ఇప్పుడు సినిమా నుండి ఫస్ట్ సాంగ్ పుష్ప పుష్ప(PUSHPA PUSHPA (Telugu Lyrical) Pushpa 2 The Rule)  ని రిలీజ్ చేశారు…

దాంతో ఈ సాంగ్ ఓవరాల్ గా లిరికల్ వీడియోల పరంగా కొత్త రికార్డులతో దుమ్ము దుమారం లేపడం ఖాయమని అందరూ అనుకున్నారు. టాలీవుడ్ లో లిరికల్ వీడియోల పరంగా ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ రికార్డ్ విషయంలో ఈ సినిమా సాంగ్ సంచలనం సృష్టిస్తుంది అనుకున్నా కూడా ఆల్ మోస్ట్ 30  నిమిషాల టైం తీసుకుని 1 లక్ష లైక్స్ ని అందుకుంది.

టాలీవుడ్ సాంగ్స్ లో ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ను అందుకున్న సాంగ్స్ ను గమనిస్తే… 
Tollywood Fastest 100K likes Lyrical Videos
#Kalaavathi – 9Mins+
#LaLaBheemla – 11mins~
#BheemlaNayakFirstSingle : 12Mins~
#PennySong – 13Mins~
#Sooreede(#Salaar) – 16Mins~
#DaakkoDaakkoMeka: 19Mins~
#Dosti Music Video: 19Mins
#SVPTitleSong – 19Mins~
#MaguvaMaguva: 22Mins~
#Srivalli – 23Mins+
#EeRaathale – 25Mins
#PushpaPushpa(#Pushpa2) – 30Mins~*****
#SathyamevaJayathe -33mins
#NaatuNaatu – 35Mins

టాప్ రికార్డ్ ను బ్రేక్ చేస్తుంది అనుకున్నా కూడా ఓవరాల్ గా ఈ సాంగ్ టాప్ 10 లో కూడా ఎంటర్ అవ్వలేక పోయింది. ఓవరాల్ గా టాప్ 12 ప్లేస్ ని మాత్రమే సొంతం చేసుకుంది. కొత్త రికార్డులు నమోదు చేస్తుంది అనుకున్నా ఎలాంటిది ఏమి జరగలేదు…. ఇక టాప్ ప్లేస్ లో ఉన్న కళావతి సాంగ్ రికార్డ్ ను ఏ సాంగ్ ఫ్యూచర్ లో బ్రేక్ చేస్తుందో చూడాలి.

AP-TG 2nd Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here