యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండేళ్ళ కి పైగా టైం తీసుకుని చేసిన సినిమా సాహో, భారీ అంచనాల నడుమ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కి ఓవర్సీస్ నుండి యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ లో టాక్ రాగా రెగ్యులర్ షోలకి కూడా ఆల్ మోస్ట్ యావరేజ్ రేంజ్ లోనే టాక్ వచ్చింది, ఇక సినిమా కి రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ కామన్ ఆడియన్స్ ఈవినింగ్ షోలకు రాగా…
వారినుండి ఫైనల్ గా సినిమా కి ఎలాంటి టాక్ లభిస్తుందో ఫైనల్ టాక్ ఏంటో తెలుసుకుందాం పదండీ.. ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ ని ఇష్టపడుతున్నా కానీ బోర్ కొట్టే సీన్స్ అండ్ యాక్షన్ డోస్ మరీ ఎక్కువ అవ్వడం ఇబ్బంది పెట్టిందని కానీ ఓవరాల్ గా ఒకసారి చూసే విధంగా….
సినిమా ఉందని, వారి టాక్ ఫైనల్ గా యావరేజ్ టు ఎబో యావరేజ్ గా చెబుతున్నారు, ఇక కామన్ ఆడియన్స్ మాత్రం సినిమాలో నెగటివ్స్ గట్టిగానే చెబుతున్నారు, కథ పాయింట్ రొటీన్ గా ఉందని, VFX కొన్ని సీన్స్ కి చాలా నాసిరకంగా అనిపించిందని, సెకెండ్ ఆఫ్ చాలా స్లో నరేషన్ ఉందని, సాంగ్స్ అస్సలు బాలేవని…
యాక్షన్ సీన్స్ ఉన్నా అందులో హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ పెట్టకపోవడం బాలేదని ఇలా చాలానే నెగటివ్ పాయింట్స్ చెబుతున్నారు. ఫైనల్ గా ప్రభాస్ కష్టం కోసం ఒకసారి చూడొచ్చు అంటున్న కామన్ ఆడియన్స్ సినిమా కి మొత్తం మీద యావరేజ్ టాక్ నే చెబుతున్నారు…
దాంతో రోజు మొదలు నుండి డే ఎండ్ వరకు సినిమా అందరి టాక్ ఫైనల్ గా యావరేజ్ లెవల్ లోనే ఉందని చెప్పాలి, కానీ సినిమా కి పోటిగా మరే సినిమా లేకపోవడం, ప్రభాస్ కోసం అందరు ఒకసారి చూడొచ్చు అంటుండటం తో లాంగ్ రన్ లో ఎలా హోల్డ్ చేస్తుందో అనేది ఆసక్తి కరం అని చెప్పొచ్చు. 272 కోట్ల టార్గెట్ అందుకోవాలి అంటే కలెక్షన్స్ అస్సలు తగ్గకుండా ట్రెండ్ కొనసాగాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి.