Home న్యూస్ FIR మూవీ రివ్యూ….కుమ్మింది సినిమా….కానీ!!

FIR మూవీ రివ్యూ….కుమ్మింది సినిమా….కానీ!!

0

కొన్ని సినిమాలు స్టార్ట్ అవ్వడం స్లో గా స్టార్ట్ అయ్యి కథ నత్తనడకన సాగుతున్నా కానీ ఒక స్టేజ్ కి వచ్చే సరికి ఇక సినిమా పని ఔట్ అనుకున్నప్పుడు సడెన్ గా యూ టర్న్ తీసుకుని ఒకటి తర్వాత ఒకటి ఆసక్తిని కలిగించే సీన్స్ తో ఎండ్ కార్డ్ టైం కి… ఓహో ఇందుకోసమా ఇదంతా చేసింది అనిపించి ఎండ్ అయ్యే టైం కి ఓ రేంజ్ లో కిక్ ఇచ్చేలా కొన్ని సినిమాలు ఉంటాయి….

ఇప్పుడు ఈ కోవలోకే వస్తుంది విష్ణు విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ FIR…. కథ పాయింట్ కి వస్తే ముస్లిం అని తెలిస్తే చాలు తనపై అనుమానం కొంచమైన ఉంటుంది పోలిసులకు… అలాంటిది ఆ ముస్లిం లైఫ్ కాస్త డౌట్ గా ఉంటే ఇక అనుమానాలు ఎక్కువ అవుతాయి… ఇలాంటిదే హీరో లైఫ్ లో జరుగుతుంది…

ఓ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది ఎలా ఉంటాడో కూడా తెలియదు, కానీ టెర్రరిస్ట్ హీరోనే అనిపించేలా కొన్ని సీన్స్ పడతాయి. ఇంతకీ హీరో బ్యాగ్రౌండ్ ఏంటి, అమాయకుడా లేక నేరస్తుడా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ఫస్టాఫ్ అంతా కథ నత్తనడకన సాగుతూ బోర్ కొట్టిస్తూ ఇంటర్వెల్ టైం కి మంచి పాయింట్ తో ఆకట్టుకోగా….

సెకెండ్ ఆఫ్ కూడా కొంచం స్లోగా స్టార్ట్ అయినా ఫస్టాఫ్ లో ఉన్న చిక్కుముడులు అన్నీ ఒక్కోటిగా విప్పుస్తూ సెకెండ్ ఆఫ్ ట్విస్ట్ లు టర్న్ లో ఆకట్టుకుంటూ క్లైమాక్స్ మరింత బాగా మెప్పించి ఫస్టాఫ్ ఇచ్చిన ఇంప్రెషన్ ని మొత్తం మారుస్తూ మెప్పిస్తుంది, సింపుల్ గా స్టార్ట్ అయ్యి ఎక్స్ లెంట్ గా ముగిసి మంచి ఫీల్ తో సినిమా ఎండ్ అయ్యేలా చేస్తుంది…

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ ముందే చెప్పినట్లు ఫస్ట్ బోర్ ఫీల్ అయినా కొంచం ఓపిక చేసుకుని చూస్తె ఎండ్ అయ్యే టైం కి మంచి ఫీల్ తో బయటికి వస్తారు… ఆ ఎండింగ్ కిక్ ఇస్తుంది కానీ కొంచం ఓపిక చేసుకుని చూడాల్సి ఉంటుంది… మొత్తం మీద సినిమా కుమ్మింది కానీ ఫస్టాఫ్ కొంచం లెంత్ తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here