టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్ ల క్రేజీ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie) మీద విపరీతమైన అంచనాలు ఉండగా సినిమా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా గ్రౌండ్ లెవల్ లో…
యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది, మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ పోటిలో హనుమాన్(HanuMan Movie) వీర లెవల్ రాంపేజ్ వలన గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ జోరు తగ్గింది, అయినా కూడా సినిమాకి వచ్చిన మిక్సుడ్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సెలవులను అడ్వాంటేజ్ గా తీసుకుని…
అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తుంది, నైజాంలో కలెక్షన్స్ లో డ్రాప్స్ ఉన్నా కూడా ఆంధ్రలో సినిమా స్టడీగా దూసుకు పోతూ ఉండటం విశేషం, ఓవరాల్ గా సినిమా సంక్రాంతి సెలవులు పూర్తి అయ్యే టైంకి అటూ ఇటూగా 65-70% వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో రికవరీని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది…
మిక్సుడ్ టాక్ తో సంక్రాంతి సెలవుల అడ్వాంటేజ్ ఉన్నా కూడా, పోటిలో ఉన్న ఇతర సినిమాల జోరుని తట్టుకుని ఇంత రికవరీని అందుకోవడం మాత్రం విశేషం అనే చెప్పాలి, అదే టైంలో సినిమాకి కనుక మంచి హిట్ టాక్ కనుక వచ్చి ఉంటే సంక్రాంతికి ఓవరాల్ గా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఈ సినిమా…
చాలా రికార్డులను నమోదు చేసి ఉండేది, సినిమాకి మొదటి రోజు వచ్చిన మిక్సుడ్ టాక్ తో ఇక తేరుకుంటుందో లేదో అన్న డౌట్ ఉన్నా కూడా ఇప్పుడు చాలా వరకు రికవరీని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతి సెలవుల తర్వాత సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరం అని చెప్పాలి.