Home న్యూస్ 2024 సంక్రాంతి విన్నర్…అండ్ లూసర్ ఈ సినిమాలే!!

2024 సంక్రాంతి విన్నర్…అండ్ లూసర్ ఈ సినిమాలే!!

1

2024 సంక్రాంతికి ముందుగా 5 సినిమాలు రిలీజ్ అవ్వాలని అనుకున్నా అందులో ఒక సినిమా రిలీజ్ చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అవ్వగా 4 సినిమాల మధ్య పోటి నెలకొనగా అన్ని సినిమాలలోకి కూడా సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసే అవకాశం ఉన్న సినిమాగా అనిపించిన గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా…

మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతి సెలవుల్లో ఉన్నంతలో బాగానే థియేటర్స్ కి వస్తూ ఉండటంతో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధిస్తూ ఉండగా, కింగ్ నాగార్జున(Nagarjuna) నటించిన నా సామి రంగ(Naa Saami Ranga) మూవీ ముందు నుండి నాగార్జునకి కంబ్యాక్ మూవీ అవుతుంది అనిపించగా…

సినిమా రిలీజ్ అయ్యాక అదే ఆల్ మోస్ట్ నిజం అవుతూ మంచి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తూ దూసుకు పోతుంది, కానీ అన్ని సినిమాల మధ్యలో టాక్ రాకపోతే భారీగా దెబ్బపడే సినిమాలా అనిపించినా కూడా యునానిమస్ పాజిటివ్ టాక్ తో ఏకంగా అన్ని సినిమాలను లోకల్ నుండి ఓవర్సీస్ వరకు కూడా డామినేట్ చేస్తూ….

హనుమాన్(HanuMan Movie) ఈ ఇయర్ సంక్రాంతి క్లీన్ విన్నర్ గా నిలిచింది, 3 రోజుల లోపే బ్రేక్ ఈవెన్ ని అందుకుని ఇప్పుడు లాంగ్ రన్ లో ఊహకందని లాభాలను సొంతం చేసుకోడానికి సిద్దం అవుతూ ఈ ఇయర్ సంక్రాంతి విన్నర్ గా హనుమాన్ మూవీ నిలవగా, సంక్రాంతి లూసర్ గా విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన….

సైంధవ్(Saindhav Movie) నిలిచింది అని చెప్పాలి. డిసెంబర్ టైంలోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సలార్(Salaar) వలన పోస్ట్ పోన్ అయ్యి సినిమా జానర్ కి సెట్ అవ్వని సంక్రాంతికి రిలీజ్ అవ్వగా టాక్ మిక్సుడ్ గా రావడంతో ఓవరాల్ గా అన్ని సినిమాల్లో లాస్ట్ ఆప్షన్ గా మారిపోయింది. బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం చాలా కష్టంగా కనిపిస్తూ ఉండటంతో ఈ సినిమా ఈ ఇయర్ సంక్రాంతికి నిరాశ పరిచిన సినిమాగా మారబోతుంది అని చెప్పాలి.

1 COMMENT

  1. Gunturu kaaram movie all Time world wide industry hit ayindhi with record breaking collections
    If you know please give correct information otherwise Don’t give ok

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here