టాలీవుడ్ లో కొన్ని చిన్న సినిమాలకు చాలా వరకు టాప్ స్టార్ సినిమాలకు రిలీజ్ రోజుకి కొన్ని గంటల ముందు బెనిఫిట్ షోలు వేయడం అనేది సర్వ సాదారణంగా జరుగుతూ వస్తుంది. నైజాం లో కొంతకాలంగా బెనిఫిట్ షోలను కాన్సిల్ చేసినా అప్పుడప్పుడు స్పెషల్ షోలు వేసేవాళ్ళు కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఎప్పుడూ బెనిఫిట్ షోలు అన్ని సినిమాలను కూడా క్రమం తప్పకుండా పడేవి… అలాంటి ఈ బెనిఫిట్ షోలను ఇప్పుడు…
అఫీషియల్ గా కాన్సిల్ చేస్తున్నట్లు టాలీవుడ్ నిర్మాత సి కళ్యాణ్ రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తో జరిపిన చర్చల్లో భాగంగా వివరించారు. ఇక మీదట ఆంధ్రలో బెనిఫిట్ షోలు ఉండవని, ఆ బెనిఫిట్ షోలలో టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్లు పెడతారు కాబట్టి వాటిని ప్రభుత్వం ట్రాక్ చేయలేదు…
అందువలన వాటిని ఇక కాన్సిల్ చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. బెనిఫిట్ షోలు ఫ్యాన్స్ షోలు అని అంటారు, బయ్యర్లు థియేటర్ ఓనర్లు భారీ రేట్లు పెట్టి కొన్న సినిమాలకి మొదటి రోజు కలెక్షన్స్ రూపంలో వచ్చే మొత్తంలో మేజర్ పార్ట్ బెనిఫిట్ షోల నుండి సొంతం చేసుకుంటారు. ఫ్యాన్స్ ఎంత డబ్బైన పెట్టి సినిమా చూడాలని చూడటం వలన కలెక్షన్స్ వస్తాయి, కానీ ఇప్పుడు ఇక అవి ఉండవు కాబట్టి ఆడియన్స్ కి డబ్బులు మిలగడం థియేటర్ ఓనర్స్ కి సింహ భాగం కలెక్షన్స్ ఆగడం, సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ పై గట్టి ఇంపాక్ట్ నే క్రియేట్ చేయడం ఖాయం…