ఆడియన్స్ ముందుకు మహా శివరాత్రి కానుకగా వచ్చిన సినిమాల్లో గాలి సంపత్ సినిమా కూడా ఒకటి, అనిల్ రావిపూడి సమర్పణలో శ్రీ విష్ణు రాజేంద్రప్రసాద్ ల కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…. ముందుగా కథ పాయింట్ కి వస్తే.. ఒక యాక్సిడెంట్ లో వోకల్ కార్డ్స్ దెబ్బతినడంతో మాట కోల్పోయిన రాజేంద్రప్రసాద్ చిన్నప్పటి నుండి తనదగ్గరే పెరిగిన సత్యని తన వాయిస్ ట్రాన్స్ లేటర్ గా పెట్టుకుంటాడు.
నాటకాలు అంటే పిచ్చి అయిన అయిన రాజేంద్ర ప్రసాద్ కి కొడుకు శ్రీవిష్ణు కి గొడవలు జరుగుతూ ఉంటాయి, ఒక DCM కొనుక్కుని తను ప్రేమించిన అమ్మాయితో సెటిల్ అవ్వాలి అనుకుంటున్న టైం లో నాటకాల పిచ్చితో రాజేంద్రప్రసాద్ చేసిన ఒక పని వల్ల తండ్రికి కొడుక్కి గొడవ పెద్దగా అవుతుంది, తర్వాత అనుకోకుండా ఒక 30 అడుగుల నూతిలో పడిపోతాడు రాజేంద్రప్రసాద్…
ఆ విషయం తెలియని శ్రీ విష్ణు పొతే పోయాడులే అనుకుంటాడు, దాంతో తర్వాత ఎం జరిగింది, మాట రాని రాజేంద్రప్రసాద్ ఆ నూతి నుండి బయట పడ్డాడా లేదా, తన తండ్రి పై హీరో మనసు మారిందా లేదా లాంటి సంగతులు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
కొన్ని కథలకు స్టొరీ పాయింట్ రివీల్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని కథలకు చాలా కథ చెప్పాల్సి వస్తుంది ఈ కథ కూడా అలాంటిదే. కంప్లీట్ గా ఎమోషనల్ టచ్ ఉన్న ఈ సినిమా లో రాజేంద్రప్రసాద్ నట విశ్వరూపం మనం చూస్తాం, చాలా టైం తర్వాత అద్బుతమైన పెర్ఫార్మెన్స్ చేయగలిగే పాత్ర దొరకరంతో రాజేంద్రప్రసాద్ చెడుగుడు ఆడేసుకున్నారు. అందుకు శ్రీ విష్ణు కూడా చక్కని సహకారం అందించారు.
తండ్రి కొడుకుల మధ్య సన్నివేశాలు బాగా రాసుకున్నారు, పెర్ఫార్మెన్స్ పరంగా ముందే చెప్పినట్లు రాజేంద్రప్రసాద్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీ ఇది, ఇక శ్రీ విష్ణు కూడా ఆకట్టుకోగా సత్య కామెడీ కొద్దివరకు కామిక్ రిలీఫ్ ఇచ్చింది, మిగిలిన పాత్రలు ఓకే అనిపించే విధంగా ఉండగా సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. కొన్ని సీన్స్ హార్ట్ టచింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది.
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ కొంచం సెట్ అవ్వడానికి టైం పట్టగా తర్వాత ఇంటర్వెల్ వరకు మెప్పించగా సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అయినట్లు డ్రాగ్ అయినట్లు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది, ఇక డైరెక్షన్ విషయానికి వస్తే.. కథ ఆల్ రెడీ తెలిసిన పాయింట్ అయినా చాలా వరకు డైరెక్టర్ మెప్పించాడు అనే చెప్పాలి.
కానీ కథ తర్వాత సీన్ ఏమవుతుంది అన్నది ఒక స్టేజ్ దాటాక చూస్తున్న ఆడియన్స్ కి యిట్టె చెప్పగలరు, అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంకా ఎఫెక్టివ్ గా ఉండాల్సింది అనిపించింది, దాంతో అప్పటి వరకు లేని ఎమోషనల్ టచ్ ఆడియన్స్ కి అంతగా ఎక్కేలేదు…అలాగే కథనం కూడా చాలా సింపుల్ గా సీన్ బై సీన్ ఆడియన్స్ అంచనాలను తగ్గట్లుగానే సాగడం జరుగుతుంది… ఓవరాల్ గా సినిమా రాజేంద్రప్రసాద్ గారి వన్ మ్యాన్ షో గా చెప్పుకోవాలి…మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్..