మహా శివరాత్రి వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ మంచి రివ్యూలు రేటింగ్ లు సొంతం చేసుకున్న విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…
కానీ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో మాత్రం సినిమా స్లో డౌన్ అయింది..అయినా కానీ వీకెండ్ లోనే సినిమా చాలా వరకు బిజినెస్ ను రికవరీ చేయగా తర్వాత రెండో వీకెండ్ పూర్తి అయ్యే టైంకి బ్రేక్ ఈవెన్ ని అందుకుని లాభాల బాటలో అడుగు పెట్టింది…. ఇక సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా కూడా…
మంచి రికవరీని సొంతం చేసుకుంది…మరి డబ్బులు ఎవరికి రిటర్న్ ఇవ్వబోతున్నారో అని ఆశ్యర్యపోతున్నారా…. ఈ సినిమాను క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించారు….అలా హెల్ప్ తీసుకుని సినిమాను చాలా టైంగా నిర్మించగా ఇప్పుడు థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ తో మొత్తం మీద…
సినిమా కి మంచి లాభాలు ఓవరాల్ గా సొంతం అయ్యాయి. దాంతో ఈ సినిమా కోసం క్రౌండ్ ఫండింగ్ చేసిన వాళ్ళకి టీం మెయిల్స్ ద్వారా ఇచ్చిన డబ్బులకు వడ్డీలు లాభాలు కూడా కలిపి రిటర్న్ ఇవ్వనున్నట్లు తెలియజేశారట…. ఇలా క్రౌడ్ ఫండింగ్ తో నిర్మాణం అయ్యి మంచి రిజల్ట్ ను సొంతం చేసుకున్న గామి అప్ కమింగ్ టైంలో….
ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ మూవీస్ కి మంచి బెంచ్ మార్క్ గా నిలవబోతుంది అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి లాభాలనే ఓవరాల్ గా సొంతం చేసుకోగా మేకర్స్ కి అన్నీ ఖర్చులు పోయిన తర్వాత కూడా డీసెంట్ ప్రాఫిట్స్ ను ఇవ్వనుందని అంటున్నారు…