Home న్యూస్ 200 కోట్ల చరిత్ర….అన్ సీజన్ లో రికార్డులు అన్నీ చెల్లాచెదురు!!

200 కోట్ల చరిత్ర….అన్ సీజన్ లో రికార్డులు అన్నీ చెల్లాచెదురు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి మార్చ్ లాంటి నెలలు స్టూడెంట్స్ కి పరీక్షలు లాంటివి ఉంటాయి కాబట్టి మేజర్ గా పెద్ద సినిమాలు అవ్వకపోవడంతో అన్ సీజన్ గా మారిపోయింది అన్ని ఇండస్ట్రీలలో కూడా….కానీ ఇప్పుడు ఇలాంటి అన్ సీజన్ లో కూడా మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చిన…

ఒక సినిమా ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసి పాత ఇండస్ట్రీ హిట్ ను క్రాస్ చేయడమే కాదు ఇప్పుడు ఏకంగా ఆల్ టైం ఎపిక్ బెంచ్ మార్క్ ని కూడా సెట్ చేసింది…ఆ సినిమానే మలయాళంలో రిలీజ్ అయ్యి తమిళనాడు, ఓవర్సీస్ లో రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys Industry HIT)….

లాస్ట్ ఇయర్ వచ్చిన 2018 మూవీ మలయాళ ఇండస్ట్రీ తరుపున ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసి టోటల్ రన్ 178 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన ఈ సినిమా కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తూ 180 కోట్లు, 190 కోట్ల మార్క్ ని దాటేసి రీసెంట్ గా ఏకంగా ఆల్ టైం రికార్డ్ లెవల్ లో….

200 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇప్పటికీ సినిమా వసూళ్ళ జోరు స్టడీగా ఉండటంతో లాంగ్ రన్ లో మరింతగా కలెక్షన్స్ ని పెంచుకునే అవకాశం ఉండగా ఇంకా తెలుగు డబ్ వర్షన్ కూడా రిలీజ్ అవ్వాల్సి ఉండటంతో ఇక్కడ కూడా సినిమా దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here