Home న్యూస్ 10.52M*….ఊహకందని ఊచకోత!

10.52M*….ఊహకందని ఊచకోత!

0

 టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా మొత్తం తమ ఆధీనంలో పెట్టు కున్నారు, టాలీవుడ్ తరుపునే కాదు ఇప్పుడు ఏకంగా ఇండియా వైడ్ గా బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోశారు, ఇక్కడ విశేషం ఏంటి అంటే మొదటి ప్లేస్ లో ఉన్న తమ ఓన్ రికార్డ్ ను తామే బ్రేక్ చేసి ఇప్పుడు సరికొత్త సంచలనం సృష్టించారు ఫ్యాన్స్.

రీసెంట్ గా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ లో ఒకటైన గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి 8 ఏళ్ళు పూర్తీ అయిన సందర్భంగా సోషల్ మీడియా లో భారీ ట్రెండ్ ని మొదలు పెట్టిన ఫ్యాన్స్ పాత రికార్డుల బెండు తీసిన విషయం తెలిసిందే.

కేవలం 34 నిమిషాల్లో 1 మిలియన్ ట్వీట్స్, తర్వాత గంటలో 1.8 మిలియన్ కి పైగా ట్వీట్స్ పోల్ అవ్వగా 5 మిలియన్స్ కి కేవలం 4 గంటల 27 నిమిషాల టైం మాత్రమె పట్టింది, ఇక ఈ రోజు కూడా ఈ ట్రెండ్ కొనసాగగా.. టాలీవుడ్ చరిత్రలో మూవీ యానివర్సరీ ట్రెండ్ లో బిగ్గెస్ట్ రికార్డ్ కొట్టిన…

మహేష్ బాబు పోకిరి 14 ఏళ్ల ట్రెండ్ రికార్డ్ అయిన 8.47 మిలియన్ ట్వీట్ రికార్డ్ ను బ్రేక్ చేసి మొట్ట మొదటి 10 మిలియన్ యానివర్సరీ ట్రెండ్ ను నమోదు చేయగా ఇప్పుడు ఓవరాల్ గా అన్ని ట్రెండ్స్ ని కలుపుకుంటే బిగ్గెస్ట్ ట్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ బర్త్ డే ట్రెండ్ 10.51 మిలియన్ ట్వీట్స్ ని ఇంకా…3న్నర గంటల సమయం ఉండగానే…

బ్రేక్ చేసి ఇండియా వైడ్ గా ఆల్ టైం బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేశారు, వీళ్ళ ఊపు చూస్తుంటే 24 గంటలు పూర్తీ అయ్యే సరికి మినిమం 13 నుండి 14 మిలియన్ ట్వీట్స్ వేసినా ఆశ్యర్యపోనవసరం లేదని అంటున్నారు. 24 గంటలు పూర్తీ అయ్యాక కంప్లీట్ రిపోర్ట్ ని అప్ డేట్ చేస్తాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here