Home న్యూస్ కొత్త సినిమాలకే రాని వసూళ్లు – రీ రిలీజ్ కి వీకెండ్ లో వచ్చాయిగా!!

కొత్త సినిమాలకే రాని వసూళ్లు – రీ రిలీజ్ కి వీకెండ్ లో వచ్చాయిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హీరోలు ఒక టైం దాటాక స్లో అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మార్కెట్ కోల్పోవడం అన్ని ఇండస్ట్రీలలో జరుగుతుంది. బాలీవుడ్ లో ఎర్లీ 2000 టైంలో భారీ బ్లాక్ బస్టర్స్ ను సొంతం చేసుకున్న సన్నీ డియోల్ అనే హీరో తర్వాత టైంలో కంప్లీట్ గా స్లో అయిపోయాడు…

మార్కెట్ కూడా పూర్తీగా తగ్గిపోగా తన కొత్త సినిమాలను ఆడియన్స్ అసలు పట్టించుకోవడమే మానేశారు. ఇక ఓపెనింగ్స్ కూడా మినిమమ్ ఇంపాక్ట్ ని చూపించలేక పోయాయి. ఇలాంటి టైంలో తన కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన…

గదర్ సినిమాకి సీక్వెల్ ను ఆడియన్స్ ముందుకు ఆగస్ట్ 11న తీసుకు రాబోతుండగా రీసెంట్ గా గదర్ సినిమాను రీ రిలీజ్ చేశారు…. అప్పట్లో 130 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని కొన్నేళ్ళ పాటు రికార్డ్ హోల్డర్ గా నిలిచి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఈ సినిమా…

రీసెంట్ గా రీ రిలీజ్ అయ్యి మొదటి రోజున 35 లక్షలు, రెండో రోజు 45 లక్షలు మూడో రోజు 55 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని ఇండియాలో అందుకుని వీకెండ్ లో 1.35 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సాధించింది…. ఇవి సన్నీ డియోల్ చేసిన కొన్ని కొత్త సినిమాల…

ఓపెనింగ్స్ కన్నా కూడా ఎక్కువ అవ్వడం విశేషం. ఈ సినిమా కే జనాలు ఇలా వస్తే సీక్వెల్ మూవీ కి మినిమమ్ టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర గదర్2 సినిమా సంచలనాలు సృష్టించవచ్చు అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మరి ఇది నిజం అవుతుందో కాదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here