బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో రూపొందిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకున్నప్పటికీ కూడా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది.
కానీ సినిమా మీద ఉన్న ఎంతో కొంత హైప్ రామ్ చరణ్-శంకర్ ల కాంబో క్రేజ్ వలన ఎలాగోలా సినిమా 200 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా, రన్ ని పూర్తి చేసుకున్న సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది….అమెజాన్ ప్రైమ్ లో సినిమా డిజిటల్ రిలీజ్ ను…
సొంతం చేసుకోగా ఇప్పుడు డిజిటల్ లో సినిమా చూసిన ఆడియన్స్ నుండి సినిమాకి ఎలాంటి టాక్ సొంతం అవుతుంది అన్నది ఆసక్తిగా మారగా, ఓటిటి రెస్పాన్స్ థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ కన్నా కూడా చాలా బెటర్ గా ఉందని చెప్పొచ్చు. థియేటర్ వర్షన్ లో కూడా కొన్ని చిన్న చిన్న కట్స్ తో…
సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా, రామ్ చరణ్ అప్పన్న రోల్ కి యునానిమస్ రెస్పాన్స్ సొంతం అవ్వగా సెకెండ్ ఆఫ్ లో మంచి సీన్స్ పడ్డాయని అంటున్నారు, కానీ లవ్ స్టోరీ అంతగా ఎఫెక్టివ్ గా లేక పోవడం, స్టోరీ ఓవరాల్ గా పాయింట్ చాలా నార్మల్ గా ఉండటం లాంటివి…
దెబ్బ కొట్టినప్పటికీ ఒక డీసెంట్ పొలిటికల్ టచ్ ఉన్న కమర్షియల్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది అంటూ ఆడియన్స్ చెబుతున్నారు, కానీ మరీ ఎపిక్ డిసాస్టర్ అవ్వాల్సిన కంటెంట్ అయితే సినిమాలో లేదని, చాలా వరకు బెటర్ కంటెంట్ సినిమా లో ఉన్నప్పటికీ…
ఈ రేంజ్ లో డిసాస్టర్ రిజల్ట్ ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదని అంటున్నారు, ఓవరాల్ గా సినిమాకి థియేటర్స్ లో కన్నా కూడా డిజిటల్ లో ఆడియన్స్ నుండి చాలా బెటర్ రెస్పాన్స్ అయితే ఇప్పుడు సొంతం అయ్యింది అని చెప్పాలి. ఇక ఓవరాల్ గా డిజిటల్ లో ఎలాంటి వ్యూవర్ షిప్ తో సినిమా కుమ్మేస్తుందో చూడాలి.