Home న్యూస్ 85CR హీరో…. గం గం గణేశా బిజినెస్, థియేటర్స్….బ్రేక్ ఈవెన్ టార్గెట్!!

85CR హీరో…. గం గం గణేశా బిజినెస్, థియేటర్స్….బ్రేక్ ఈవెన్ టార్గెట్!!

0

లాస్ట్ ఇయర్ బేబి మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ అయిన గం గం గణేశా(Gam Gam Ganesha Movie) మూవీతో ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉన్నాడు…

బేబి మూవీ ఊహకందని విజయాన్ని అందుకుని టోటల్ రన్ లో 85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని సొంతం చేసుకుని మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిట్స్ ను అందుకున్న సినిమా గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత వస్తున్న గం గం గణేశా సినిమాతో ఆనంద్ దేవరకొండ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అన్నది ఆసక్తిగా మారింది…

Gam Gam Ganesha Movie Pre Release Busines and Break Even Target
ఇక ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 350 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 500 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో వాల్యూ బిజినెస్ రేంజ్ 4 కోట్ల రేంజ్ దాకా ఉంటుందని అంచనా…ఇక వరల్డ్ వైడ్ గా బిజినెస్ 5 కోట్ల రేంజ్ దాకా ఉంటుందని అంచనా….

దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే 5.50 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. బేబి లాంటి మాసివ్ సక్సెస్ తర్వాత ఇది కొంచం తక్కువ బిజినెస్ అయినా పోటిలో ఉన్నంతలో సినిమా రిలీజ్ రేంజ్ కి ఇది రీజనబుల్ రేటు అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here