లాస్ట్ ఇయర్ బేబి మూవీతో సెన్సేషనల్ హిట్ ను సొంతం చేసుకున్న ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ అయిన గం గం గణేశా(Gam Gam Ganesha Movie Review And Rating) మూవీతో వచ్చేశాడు. ట్రైలర్ రిలీజ్ తర్వాత డీసెంట్ ఎంటర్ టైనర్ లా అనిపించిన ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించగలిగిందో లేదో తెలుసుకుందాం పదండీ…
ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే హీరో హీరోయిన్ ని చూసి ఇష్టపడినా హీరోయిన్ హీరోని మోసం చేస్తుంది. దాంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలి అని ఫిక్స్ అయిన హీరో ఒక డైమండ్ ని దొంగతనం చేస్తాడు…ఆ తర్వాత ఏం జరిగింది, ఆ డైమండ్ మిస్టరీ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…. కథ పరంగా చాలా సింపుల్ కథతో వచ్చిన ఈ సినిమా…
స్టార్ట్ అవ్వడం పర్వాలేదు అనిపించేలా స్టార్ట్ అవ్వగా తర్వాత ఎటు నుండి ఎటో వెళుతూ ఓవర్ ది టాప్ అనిపించే సీన్స్ తో నిండిపోయి ఒక దశ దాటాక నీరసం తెప్పిస్తుంది. ఫస్టాఫ్ చాలా వరకు యావరేజ్ గా సాగగా సెకెండ్ ఆఫ్ అయినా బాగుంటుంది అనుకుంటే సెకెండ్ ఆఫ్ లో చాలా టైం వృధా చేసిన డైరెక్టర్ లాస్ట్ అరగంటలో కొంచం మ్యాజిక్ చేశాడు…
ఆ పోర్షన్ వరకు బాగున్నా కూడా ఓవరాల్ గా సినిమా పరంగా యావరేజ్ లెవల్ లో అనిపిస్తుంది. ఆనంద్ దేవరకొండ కెరీర్ లో తొలి కమర్షియల్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో ఉన్నంతలో తన పెర్ఫార్మెన్స్ పర్వాలేదు అనిపించేలా ఉండగా హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించేలా నటించారు…
ఒక పాట బాగున్నా ఓవరాల్ గా మ్యూజిక్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు…ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ నుండే అంతంతమాత్రమే అనిపించగా సినిమాటోగ్రఫీ బాగానే ఆకట్టుకోగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. ఇక డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా సాదాసీదాగా ఉండగా తన టేకింగ్ కూడా అలానే అనిపించింది…. క్రైం డ్రామాగా కథని చెబుతూ…
ఎంటర్ టైన్ మెంట్ ని ఇంకా బాగా పండించే అవకాశం ఉన్నా కూడా చాలా నార్మల్ సీన్స్ తోనే సరిపెట్టాడు. అలా కాకుండా కంప్లీట్ గా ఎంటర్ టైన్ మెంట్ ని మిక్స్ చేసి ఉంటే ఇంకా బాగుండేది… ఓవరాల్ గా లాస్ట్ అరగంట పర్వాలేదు అనిపించేలా ఉన్న సినిమా ఓపిక పట్టి చూస్తె యావరేజ్ లెవల్ లో అనిపించవచ్చు…. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.25 స్టార్స్….