మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna) సినిమా టీసర్ ట్రైలర్ లు రిలీజ్ అయినా కూడా మరీ అనుకున్న రేంజ్ బజ్ ను అయితే క్రియేట్ చేయలేదు. దాంతో మౌత్ టాక్ నే నమ్ముకుని ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…
ఎక్స్ రా ఏజెంట్ అయిన హీరో హీరో తన సీనియర్ అయిన నాజర్ కి ప్రాణహాని ఉందని ఒక కేసుని టేకప్ చేయాల్సి వస్తుంది….ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన హీరో తర్వాత ఏం చేశాడు, ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ పరంగా వన్ మ్యాన్ ఆర్మీగా తన లుక్స్ అండ్ యాక్టింగ్ తో మెప్పించాడు. హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ కూడా బాగానే మెప్పించాయి. ఇక హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించగా నాజర్, బిజోయ్ ఇతర యాక్టర్స్ పర్వాలేదు అనిపించేలా నటించారు…. విలన్ రోల్ కూడా జస్ట్ ఓకే అనిపిస్తుంది….
సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించగా కొన్ని సీన్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది.. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఏమాత్రం ఎఫెక్టివ్ గా లేవు.. సినిమా నరేషన్ ఎంత స్లోగా ఉందంటే… మెయిన్ స్టోరీ పాయింట్ బాగున్నా ఆ కథని డైరెక్టర్ డీల్ చేసిన విధానం చూస్తున్న ఆడియన్స్ కి నీరసం తెప్పిస్తుంది…
ఫస్టాఫ్ లో కథ నత్తనడకన సాగగా ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగానే మెప్పించగా సెకెండ్ ఆఫ్ కథ మళ్ళీ స్లో నరేషన్ తో లాగ్ సీన్స్ తో నిండిపోగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అలాగే కోర్ పాయింట్ చెప్పిన విధానం ఎఫెక్టివ్ గా ఉండటం ఒక్కటే సినిమాలో చెప్పుకోదగ్గ విషయం అని చెప్పాలి…
అవి తప్పితే సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉండటం అలాగే భారీ లోకేషన్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ లెంట్ గా ఉండటం బాగున్నా కానీ అసలు కథని చెప్పిన విధానమే ఎఫెక్టివ్ గా లేక పోవడంతో…
కొన్ని సీన్స్ మినహా గాండీవధారి అర్జున సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది అని చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ సైతం చాలా ఓపికతో చూస్తె మొత్తం మీద సినిమా యావరేజ్ లెవల్ లో అనిపించవచ్చు కానీ ఓవరాల్ గా ఓపిక ఎక్కువ అవసరం అని చెప్పాలి…. సినిమాకి మొత్తం మీద మేం ఇస్తున్న రేటింగ్ 2.25 స్టార్స్….