హీరోయిన్ అంజలి(Anjali) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindhi Review) సినిమా ఆడియన్స్ ముందుకు రంజాన్ కానుకగా రిలీజ్ అయింది…మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే గీతాంజలి అనే సినిమా తీసిన శ్రీనివాస్ రెడ్డి వరుస ఫ్లాఫ్స్ తో ఉన్న టైంలో మరో కొత్త కథని తీయాలని చూస్తాడు. అంజలి హీరోయిన్ గా ఎంచుకుని ఒక భూత్ బంగ్లాలో షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
టాలీవుడ్ లో చాలా రొటీన్ అయిపోయిన హర్రర్ కామెడీ నేపధ్యంలో తెరకెక్కిన గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా మరోసారి అదే పాయింట్ తో రాగా కొన్ని సీన్స్ వైజ్ బాగానే నవ్వించింది, ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగానే మెప్పించింది, సెకెండ్ ఆఫ్ లో కూడా కొన్ని చోట్ల వర్కౌట్ అయినా కూడా క్లైమాక్స్ వీక్ గా అనిపించింది..
అంజలి తన రోల్ వరకు బాగానే నటించి మెప్పించగా శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, సునీల్, ఆలి, రవి శంకర్ ఇలా ఉన్నంతలో అందరూ బాగానే నటించారు…సంగీతం వీక్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా వీక్ గానే ఉంది…ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పర్వాలేదు అనిపించే విధంగా ఉంది అనే చెప్పాలి.
ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగుండగా డైరెక్షన్ ఎంచుకున్న పాయింట్ ఆల్ రెడీ తెలుగులో వాడి వాడి బోర్ కొట్టిన కథనే అయినా కూడా మరోసారి చూసే విధంగానే ఉందని చెప్పాలి, కానీ కథ పరమ రొటీన్ గానే ఉండటం, తర్వాత సీన్స్ చాలా వరకు గెస్ చేసేలా ఉండటం లాంటివి కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేసినా కూడా…
ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ కి స్టొరీ పాయింట్ రొటీన్ గానే అనిపించినా పార్టు పార్టులుగా బాగానే అనిపించింది, ఎండింగ్ మరింత బాగుంటే సినిమా ఇంకొంచం ఎక్కువగా ఆకట్టుకునేది.. ఓవరాల్ గా పెద్దగా అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ కి సినిమా పర్వాలేదు అనిపించేలా ఉంటుంది…
కొంచం ఎక్స్ పెర్టేషన్స్ పెట్టుకుని వెళితే మాత్రం కొంచం బోర్ ఫీల్ అవ్వొచ్చు, రీసెంట్ టైంలో హర్రర్ కామెడీలు తగ్గడంతో మరోసారి ఇలాంటి జానర్ లో సినిమా చూడాలి అనుకునే వాళ్ళు గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాను ఒకసారి ట్రై చేయోచ్చు. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్….