Home న్యూస్ గోపీచంద్-శ్రీనువైట్ల=విశ్వం టీసర్ రివ్యూ….మైండ్ బ్లాంక్ టీసర్ ఇది!

గోపీచంద్-శ్రీనువైట్ల=విశ్వం టీసర్ రివ్యూ….మైండ్ బ్లాంక్ టీసర్ ఇది!

0

మాచో స్టార్ గోపీచంద్(Gopichand) అలాగే డైరెక్టర్ శ్రీనువైట్ల(Sreenu Vaitla) లకు ఎట్టి పరిస్థితులలో కూడా హిట్ చాలా అవసరం, చాలా కాలంగా హిట్ దూరం అయిన ఈ ఇద్దరి కాంబోలో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు కొత్తగా సినిమా రానుండగా ఆ సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేస్తూ టైటిల్ ను కూడా కన్ఫాం చేశారు…

సినిమాకి టైటిల్ గా విశ్వం అనే ఆసక్తి కరమైన టైటిల్ ను పెట్టగా ఫస్ట్ టీసర్ ను రిలీజ్ చేశారు. టీసర్ చూసిన తర్వాత చాలా వరకు  అందరూ ఇదేం ట్విస్ట్ రా బాబు అని అనుకోవడం ఖాయమని చెప్పాలి…. సింపుల్ గా ఒక ఊరులో పెళ్లి సెటప్, అక్కడ ఊరి జనాలు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ గా ఉండగా…

అనుకోకుండా గన్ తో వచ్చిన హీరో అక్కడ ఉన్న సామాన్య జనాల మీద గన్ తో ఫైర్ చేసి దొరికిన వాళ్ళని దొరికినట్లు చంపేస్తాడు…తర్వాత అక్కడ ఉన్న ఫుడ్ ని తిని ఎవరి పేరు మీద రాసి పెట్టి ఉంటే అన్నం వాళ్ళకే దక్కుతుంది…ఈ అన్నం నా పేరు మీద రాసి పెట్టి ఉంది అంటూ చెప్పిన డైలాగ్ తో టీసర్ ఎండ్ అయ్యి…

విశ్వం అనే టైటిల్ రివీల్ చేశారు..ఒక హీరో విలన్స్ నుండి జనాలను కాపాడుతాడు కానీ ఇక్కడ అందరికీ షాకిస్తూ ఏకంగా హీరో సామాన్య జనాలను చంపడం అన్నది మాత్రం మైండ్ బ్లాంక్ చేసింది అనే చెప్పాలి. దాంతో అసలు సినిమా ఏంటి సినిమా కాన్సెప్ట్ ఏంటి అనేది ఆసక్తిని పెంచింది అని చెప్పాలి.

చాలా కాలంగా హిట్ కి దూరం అయిన గోపీచంద్ అండ్ శ్రీనువైట్ల ఇద్దరూ కూడా ఈ సినిమాతో కంబ్యాక్ ను సొంతం చేసుకోవచ్చు అనిపించేలా టీసర్ అయితే మెప్పించింది అని చెప్పాలి. ఇక సినిమాతో ఈ ఇద్దరు ఇప్పుడు ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటారో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here