Home న్యూస్ జార్జ్ రెడ్డి రివ్యూ….ప్లస్-మైనస్ పాయింట్స్!!

జార్జ్ రెడ్డి రివ్యూ….ప్లస్-మైనస్ పాయింట్స్!!

0

      చిన్న సినిమా నే అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి క్రేజ్ తో రిలీజ్ అయిన సినిమా జార్జ్ రెడ్డి, బాక్స్ ఆఫీస్ దగ్గర నేడు రిలీజ్ అయిన ఈ సినిమా కి స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ దక్కగా ఇప్పుడు రెగ్యులర్ షోలు పూర్తీ అయ్యే సరికి ఫైనల్ గా ఎలాంటి రెస్పాన్స్ ని సినిమా సొంతం చేసుకుందో తెలుసుకుందాం పదండీ. ముందుగా స్టోరీ విషయానికి వస్తే… చిన్నప్పటి నుండే….

రెబల్ భావాలు కలిగిన హీరో ఉస్మానియా యూనివర్సిటీ లో ఎంటర్ అవ్వగా అక్కడ కాస్ట్ వైజ్ గా డివైడ్ చేసి పెట్టె కొన్ని పనులు నచ్చక పోరాడే స్టూడెంట్ గా ఎదిగిన జార్జ్ రెడ్డి ని అడ్డుకోవాలని 2 గ్రూప్స్ ట్రై చేస్తాయి. వాటిని ఎదిరించిన జార్జ్ రెడ్డి చివరికి ఎవరి వల్ల మరణించాడు అన్నది అసలు కథ.

రియల్ లైఫ్ స్టొరీ కాబట్టి కథ మెయిన్ ప్లాట్ ని రివీల్ చేస్తున్నాం కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జార్జ్ రెడ్డి గా సందీప్ జీవించి నటించాడు. ఇక హీరోయిన్ కూడా బాగానే నటించగా…

ఇతర పాత్రలు అన్నీ సినిమా పరిది మేరకు మెప్పిస్తాయి.. పాటల్లో రాయల్ ఎన్ ఫీల్డ్ ఆల్ రెడి హిట్ అవ్వగా మిగిలిన మాటలు పర్వాలేదు అనిపిస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరి పోయింది, ముఖ్యంగా ఫైట్ సీన్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే పీక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు రాఫ్ఫాడించాయి, కానీ సెకెండ్ ఆఫ్ లో కథ పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో పకడ్బందీగా కథ సాగలేదు కానీ ఫస్టాఫ్ ఫీల్ ని కొంచం తగ్గించేలా చేసింది, ఇక ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ అన్నీ అద్బుతంగా ఉన్నాయని చెప్పొచ్చు.

ఇక డైరెక్షన్ కూడా అదిరి పోగా ఫైట్ సీన్స్ ని స్పీచ్ లను డైరెక్టర్ అద్బుతంగా తెరకెక్కించాడు. సెకెండ్ ఆఫ్ మరింత పట్టుగా తీసి ఉంటె సినిమా మరో రేంజ్ కి వెళ్ళేది. ఉన్నంతలో చిన్న సినిమానే అయినా అన్ని విభాగాలు అద్బుతంగా పని చేశాయి అని చెప్పొచ్చు.

ఇక హైలెట్స్ విషయానికి వస్తే, హీరో పెర్ఫార్మెన్స్, ఫైట్ సీన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, రాయల్ ఎన్ ఫీల్డ్ సాంగ్, ఇంటర్వెల్, సెకెండ్ ఆఫ్ పోలిస్ స్టేషన్ అండ్ రెయిన్ ఫైట్ సీన్ అండ్ ఎమోషనల్ టచ్ ఉన్న క్లైమాక్స్ హైలెట్స్ గా నిలుస్తాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ ఫస్టాఫ్ ఉన్నంత జోరుగా సెకెండ్ ఆఫ్ లేకపోవడం…

ఒక్కటే మేజర్ మైనస్ పాయింట్. అదొక్కటి తప్పితే బయోపిక్ అయినా కానీ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుంది, ప్రతీ స్టూడెంట్ ని సినిమా కచ్చితంగా ఇన్ స్పైర్ చేయడం అయితే ఖాయమని చెప్పొచ్చు. సినిమా కి మా రేటింగ్ 3.25 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here