లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మార్క్ అంథోని(Mark Antony Movie) తో 102 కోట్ల బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న విశాల్(Vishal) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రత్నం(Rathnam Movie) మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు కానీ ఈ సినిమా కలెక్షన్స్ పరంగా తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంటూ వీకెండ్ లోనే…
చేతులు ఎత్తేసింది అని చెప్పాలి. సినిమా తొలి 2 రోజులు మిక్సుడ్ రెస్పాన్స్ ఉన్నా మూడో రోజు పాజిటివ్ టాక్ లా మారిందని టీం ప్రోమోలు లాంటివి రిలీజ్ చేసి ప్రమోషన్స్ చేసుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ ఏమి కూడా కనిపించ లేదు అనే చెప్పాలి…. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వచ్చిన దళపతి విజయ్(Thalapathy Vijay)…
నటించిన గిల్లి(Ghilli Movie Re Release) చేతిలో కొత్త సినిమా అయిన రత్నం ఘోరంగా ఓడిపోయింది… తొలి 2 రోజుల్లో గిల్లి టికెట్ సేల్స్ కన్నా తక్కువ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న రత్నం మూవీ మూడో రోజు అయినా గ్రోత్ ని చూపిస్తుందేమో అని అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర…
మూడో రోజులో ఉన్న రత్నం మూవీ 26 వేల టికెట్ సేల్స్ ను మాత్రమే సొంతం చేసుకుంటే రీ రిలీజ్ లో 9వ రోజులో ఉన్న గిల్లి మూవీ 32 వేల దాకా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని రత్నం సినిమాను భారీ ఎదురుదెబ్బని మరోసారి కొట్టింది. జనాలు ఓల్డ్ మూవీని చూడటానికి ఎగబడుతున్నారు కానీ కొత్త సినిమాను చూడటానికి రావడం లేదు…
దాంతో వీకెండ్ మొత్తం గిల్లి రత్నం మూవీని ఫుల్లుగా డామినేట్ చేసింది అని చెప్పాలి ఇప్పుడు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఏమైనా హోల్డ్ ని చూపెడుతుందో లేదో చూడాలి ఇప్పుడు. కానీ టార్గెట్ ను అందుకోవాలి అంటే మాత్రం వర్కింగ్ డేస్ లో రత్నం మూవీ ఊహకందని రేంజ్ లో గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.