Home న్యూస్ బాక్ ట్రైలర్ రివ్యూ….తెలుగు బిజినెస్ రేటు ఎంత అంటే!

బాక్ ట్రైలర్ రివ్యూ….తెలుగు బిజినెస్ రేటు ఎంత అంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఏప్రిల్ నెల లో రిలీజ్ అవ్వాల్సిన కొన్ని సినిమాలు మే నెలలో ఆడియన్స్ ముందుకు రానున్నాయి. వాటిలో మే మొదటి వారంలో రిలీజ్ కానున్న మూవీస్ లో తమిళ్ నుండి తెలుగు లోకి డబ్ అయ్యి రిలీజ్ అవుతున్న అరణ్మాయి4 తెలుగు డబ్ వర్షన్ బాక్(Baak Movie) ఒకటి….తమన్నా-రాశిఖన్నాల కాంబోలో వస్తున్న…

ఈ హర్రర్ కామెడీ మూవీ తెలుగు ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే రొటీన్ గానే అనిపిస్తూ ఉన్నా కూడా సినిమాలో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి అంటూ మేకర్స్ చెబుతూ ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమాను చూడటానికి థియేటర్స్ కి ఎంతవరకు వస్తారో చూడాలి. ఇక ట్రైలర్ లో….

తన సిస్టర్ తమన్నా తన బావలను చంపిన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వచ్చే హీరో ఈ హత్యల వెనక ఉన్న మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు అన్న కాన్సెప్ట్ తో వస్తున్న బాక్ మూవీ ట్రైలర్ రొటీన్ గానే అనిపించినా కొన్ని చోట్ల విజువల్స్ ఆకట్టుకోవడం తెలుగు కమెడియన్స్ ను పెట్టడంతో కొంచం ఇక్కడ వర్కౌట్ అయ్యేలా అనిపించింది…

కామెడీ కొంచం వర్కౌట్ అయినా మాస్ సెంటర్స్ లో మినిమమ్ వసూళ్ళని అందుకునే అవకాశం ఉంటుంది… ఇక సినిమాను తెలుగు లో ఏసియన్ థియేటర్స్ మరియు సురేష్ ప్రొడక్షన్ వాల్యూ రిలీజ్ చేస్తూ ఉండగా వాళ్ళ థియేటర్స్ లోనే సినిమాను ఓన్ గా రిలీజ్ చేస్తూ ఉండగా ఓవరాల్ గా సినిమా రిలీజ్ వాల్యూ బిజినెస్ రేంజ్…..

2.5 కోట్ల రేంజ్ దాకా ఉంటుందని అంచనా…..దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ బిజినెస్ మీద వసూళ్ళని సొంతం చేసుకుంటే తెలుగు లో హిట్ గా చెప్పుకోవచ్చు. డీసెంట్ టాక్ కనుక వస్తే ఈ జానర్ మూవీస్ కి ఇప్పటికీ మాస్ సెంటర్స్ లో ఎంతో కొంత ఆక్యుపెన్సీ అయితే ఉంటుంది కాబట్టి టార్గెట్ ను అందుకోవడానికి అవకాశం అయితే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here