బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జిన్నా సినిమా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే విషయంలో తీవ్రంగా నిరాశ పరిచింది, సినిమాలో కొద్ది పార్ట్ కామెడీ అండ్ క్లైమాక్స్ బాగానే వర్కౌట్ అయినా కానీ జనాలు సినిమాని ఏమాత్రం థియేటర్స్ లో చూడటానికి ఆసక్తిని చూపించలేదు. దాంతో కలెక్షన్స్ పరంగా మినిమమ్ ఇంపాక్ట్ చూపించ లేక పోయిన ఈ సినిమా బిగ్ డిసాస్టర్ గా నిలిచింది.
ఇక సినిమాకి పోటిగా రిలీజ్ అయిన సినిమాల డిజిటల్ రిలీజ్ లు అయిపోయిన తర్వాత కొంచం లేట్ గా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కి మంచి వ్యూవర్ షిప్ లభిస్తుంది కానీ సోషల్ మీడియా లో అదే టైం లో సినిమా పై…
రెండో రౌండ్ ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పాలి. సినిమా రిలీజ్ టైం లో జనాలు లేక కలెక్షన్స్ చాలా తక్కువ ఉండటంతో సినిమా ట్రోల్స్ కి గురి అవ్వగా ఇప్పుడు సినిమా చూసిన OTT ఆడియన్స్ సినిమాలో అక్కడక్కాడా కొంచం కామెడీ ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ తప్పితే…
మిగిలిన సినిమా అంతా పరమ రొటీన్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు, మళ్ళీ ఈ సినిమా కి సీక్వెల్ కూడానా అంటూ కామెంట్స్ ట్విట్టర్ లో జిన్నా హాష్ టాగ్ మీద చాలానే కనిపిస్తున్నాయి… పార్ట్ 2 కనుక ఉంటె మరింత శ్రద్ధ తీసుకుని కామెడీ అండ్ ట్విస్ట్ లు బెటర్ గా రాసుకుంటే జనాలు అప్పుడు థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉంటుంది.