Home న్యూస్ చిరుకి సాంగ్ నాకు క్లైమాక్స్ ఫైట్ పెట్టండి—-బాలయ్య!!

చిరుకి సాంగ్ నాకు క్లైమాక్స్ ఫైట్ పెట్టండి—-బాలయ్య!!

0

వచ్చే సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమాల మధ్య పోటి తీవ్రంగా ఉండబోతుండగా, ఇది వరకు కూడా చాలా సార్లు బాలయ్య మరియి చిరులు సంక్రాంతి కి తమ తమ సినిమాలతో పోటి పడ్డారు. ఇక ఇప్పుడు మరోసారి పోటికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా బాలయ్య…

హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ NBK షోలో బాలయ్య మాట్లాడుతూ గెస్టులుగా వచ్చిన సురేష్ బాబు మరియు అల్లు అరవింద్ లతో నేను సురేష్ ప్రొడక్షన్ లో చాలా సినిమాలే చేశాను కానీ మీ ప్రొడక్షన్ లో ఇప్పటి వరకు సినిమా చేయలేదు, మరి మనం కలిసి సినిమా ఎప్పుడు చేద్దాం అంటూ…

అల్లు అరవింద్ ని అడగగా అల్లు అరవింద్ నేను మీతో పాటు చిరంజీవి కలిసి చేసే సినిమా నిర్మించాలి అని అనుకుంటున్నాను అంటూ సమాదానం ఇచ్చారు. తర్వాత బాలయ్య అలా అయితే చిరు కి ఇంట్రో సాంగ్ పెట్టండి నాకు క్లైమాక్స్ ఫైట్ సీన్ పెట్టండి. తనకి సాంగ్స్ నాకు ఫైట్స్ సెట్ అవుతాయి అంటూ…

మాట్లాడగా తర్వాత షో కి సీనియర్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు రాగా ఆ సినిమాకి నేను డైరక్టర్ అయితేనే ఓకే అంటూ కామెంట్స్ చేశారు, తర్వాత బాలయ్య అప్పుడు ఆ సినిమా పాన్ వరల్డ్ సినిమా అవుతుంది అంటూ మాట్లాడారు…. ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటూ ఇప్పుడు చిరు బాలయ్యల ఫ్యాన్స్ సోషల్ మీడియా లో మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here