యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా గోపీచంద్ ఖాతాలో మంచి హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉన్న మూవీగా అందరూ భావిస్తున్నారు. ప్రామిసింగ్ ట్రైలర్ తర్వాత ట్రేడ్ లో కూడా సినిమా పై డీసెంట్ అంచనాలు ఉన్నాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటే కచ్చితంగా దుమ్ము లేపే…
అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. కానీ ఇప్పుడు రిలీజ్ కి ముందు ఒక ఎదురుదెబ్బ సినిమా కి తగలబోతుంది అని చెప్పాలి. ఈ వీకెండ్ లో రిలీజ్ కి ఇతర సినిమాలు కూడా ఉన్నప్పటికీ కూడా మేజర్ గా నోటబుల్ మూవీ మాత్రం ఇదే అవ్వడంతో…
కచ్చితంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రలో టికెట్స్ ని ఆన్ లైన్ లో తమ వెబ్ సైట్ లోనే విక్రయించాలని, ఆ టికెట్ సేల్స్ ద్వారా వచ్చే డబ్బుని ముందుగా తమ వద్ద పెట్టుకుని తర్వాత టాక్సులు కట్ చేసుకుని థియేటర్స్ ఓనర్స్ కి…
ఇస్తామని తెలియజేశారు. ఈ నిర్ణయం పై ఇండస్ట్రీ లో మిశ్రమ స్పందన వినిపిస్తూ ఉండగా దీనిని చాలా ఏరియాల థియేటర్స్ ఓనర్స్ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు, ఈ నిర్ణయానికి నిరసనగా ఇప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావారి జిల్లాల థియేటర్స్ ని ఈ జులై1 నుండి మూసి వేస్తున్నట్లు అనౌన్స్ చేశారు… దాంతో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు పక్కా కమర్షియల్ పై కూడా పడబోతున్నప్పటికీ…
ఈ సినిమా నిర్మాతలు ఈ జిల్లాలలో పక్కా కమర్షియల్ మూవీ రిలీజ్ అవుతున్న థియేటర్స్ ని మినహాయించి మిగిలిన థియేటర్స్ ని మూసివేసేలా చూస్తున్నారు…. కానీ ఫైనల్ నిర్ణయం ఇంకా రావాల్సి ఉండగా ఈ సినిమా మినహాయించి మిగిలిన థియేటర్స్ క్లోజ్ అయినా ఆ ఇంపాక్ట్ ఈ సినిమా పై కూడా ఉండే అవకాశం ఉంది. అన్నీ పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి అనుకుంటే పక్కా కమర్షియల్ కి ఇది ఒక విధంగా చిన్న ఎదురుదెబ్బ అనే చెప్పాలి.