టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆచార్య లాంటి డిసాస్టర్ తర్వాత ఓ భారీ కంబ్యాక్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్న నేపధ్యంలో ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాతో బరిలోకి దిగుతున్నాడు. కాగా సినిమా ఆల్ రెడీ తెలుగు లో డబ్ అయిన సినిమా రీమేక్ గా వస్తూ ఉండగా సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకోగా అక్కడ నుండి సినిమా…
ఫస్ట్ టాక్ ఏంటి అనేది బయటికి వచ్చింది. ఆ టాక్ ప్రకారం ఓవరాల్ గా చెప్పాలి అంటే ఒరిజినల్ లో ఉన్న సీన్స్ కొన్ని మార్పులతో హీరో ఫ్లాష్ బ్యాక్ ని కొంచం వివరిస్తూ గాడ్ ఫాదర్ ను తెరకెక్కించారు అంటున్నారు….
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత ఆ సీటు కోసం పార్టీ వాళ్ళు, ఫ్యామిలీ లో ఉన్న వాళ్ళు ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు, వాటిని ఆ పార్టీకి షాడోలా ఉండే హీరో ఎలా ఎదిరించి నిలబడ్డాడు అన్న కాన్సెప్ట్ తో వచ్చిన గాడ్ ఫాదర్ ఒరిజినల్ మెయిన్ స్టొరీనీ అలానే తీసుకున్నా కొన్ని హీరోయిజం ఎలివేట్ సీన్స్ ని…
ఎక్కువగా జోడించారని, ఇంటర్వెల్ ఎపిసోడ్ అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్స్ హైలెట్స్ అని అంటున్నారు…. కథ పరంగా ఆల్ రెడీ తెలిసిన కథని తెలుగు ఆడియన్స్ కి నచ్చే విధంగా కొన్ని చిన్న చిన్న మార్పులతో తీర్చిదిద్దారని అంటున్నారు. మొత్తం మీద లూసిఫర్ కూడా మరీ అద్బుతం అనిపించే కథ ఏమి కాదు కానీ టేకింగ్ అండ్ సీన్స్ బాగుండటం క్లైమాక్స్ మెప్పించడంతో అక్కడ భారీ విజయాన్ని అందుకుంది.
ఇక్కడ కూడా కథ అంత బలంగా లేక పోయినా ఎలివేషన్ సీన్స్ అండ్ ఫ్యాన్స్ మూమెంట్స్ సినిమాలో ఉంటాయని అంటున్నారు. ఓవరాల్ గా టాక్ ఎబో యావరేజ్ రేంజ్ లో ఉంటుంది అని అంటున్నారు. మరి ఆడియన్స్ నుండి సినిమా కి ఎలాంటి టాక్ లభిస్తుంది సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి ఇక.