టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ కి మంచి రెస్పాన్స్ లభించింది. కానీ యూట్యూబ్ లో 24 గంటల్లో మాత్రం ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో అయితే లేదనే చెప్పాలి. ముఖ్యంగా మెగాస్టార్ ప్రీవియస్ మూవీ ఆచార్య ట్రైలర్ రెస్పాన్స్ తో పోల్చితే…
గాడ్ ఫాదర్ కి వచ్చిన రెస్పాన్స్ చాలా తక్కువే అని చెప్పాలి. ఆచార్య ట్రైలర్ 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి 21.86 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోగా లైక్స్ పరంగా 838K లైక్స్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది….
కానీ అదే టైం లో ఈ రెస్పాన్స్ లో సగం రెస్పాన్స్ ను మాత్రమే సొంతం చేసుకుంది గాడ్ ఫాదర్ సినిమా ట్రైలర్. మొత్తం మీద 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి 9.04 మిలియన్ వ్యూస్ ని మాత్రమే అందుకోగా లైక్స్ పరంగా 320K లైక్స్ ని అందుకుని భారీగా నిరాశ పరిచింది.
ఓవరాల్ గా ఇది డీసెంట్ రెస్పాన్స్ అనే చెప్పాలి కానీ ప్రీవియస్ మూవీ తో కంపేర్ చేసినా ఇతర స్టార్స్ సినిమాల ట్రైలర్ రికార్డులతో కంపేర్ చేసినా ఇంకా బెటర్ రెస్పాన్స్ ను అందరూ ఆశించారు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అక్టోబర్ 5న ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.