Home న్యూస్ పొన్నియన్ సెల్వన్1 రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

పొన్నియన్ సెల్వన్1 రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్ లో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ మరియు త్రిష లాంటి భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 భారీ అంచనాల నడుమ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ ను సొంతం చేసుకుంది. కోలివుడ్ లో సినిమా పై భారీగా అంచనాలు ఉన్నప్పటికీ మిగిలిన చోట్ల మాత్రం ఆ రేంజ్ అంచనాలు అయితే లేవు. మరి సినిమా ఎంతవరకు ఆడియన్స్ ను మెప్పించగలిగిందో తెలుసుకుందాం పదండీ…. ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…

ఆదిత్య కరికాలన్ (విక్రమ్) సూచన మేరకు వల్లవరాయ (కార్తీ), చోళ వారసుడిని చంపడానికి చేస్తున్న కుట్ర గురించి తెలుసుకోవడానికి చోళ రాజ్యం మీదుగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. పొన్నియన్ సెల్వన్ అయిన అరుణ్‌మొళి (జయం రవి)ని వల్లవరాయ మరియు ఇతరులు ఎవరు కాపాడారు అనేది పొన్నియన్ సెల్వన్ సినిమా మెయిన్ స్టొరీ… ఇందులో కీలక పాత్రలో ఐశ్వర్య రాయ్ నందినిగా నటించగా తన రోల్ ఏంటి అలాగే త్రిష రోల్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….

ముందుగా పొన్నియన్ సెల్వన్ కంప్లీట్ తమిళ చరిత్రకి సంభందించిన కథ… దాంతో కంప్లీట్ గా తమిళ్ ఫ్లేవర్ తో నిండిన ఈ కథలో నటించిన వారిలో విక్రమ్ చిన్న రోల్ లో బాగా నటించి మెప్పించాగా కార్తీకి భారీ స్క్రీన్ స్పేస్ ఉన్న రోల్ దక్కగా ఆ పాత్రతో ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. ఇక జయం రవి రోల్ కూడా చిన్నదే… ఇక ఐశ్వర్య రాయ్ రోల్ బాగా మెప్పించాగా త్రిష రోల్ కి అంతగా ప్రాదాన్యత లేకున్నా స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకుంది… మిగిలిన రోల్స్ చేసిన నటీనటులు అందరూ ఆకట్టుకున్నారు…

సంగీతం జస్ట్ ఓకే అనిపించినా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఏ ఆర్ రెహమాన్ దుమ్ము లేపాడు, స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ చాలా నెమ్మదిగా ఉండగా కొన్ని చోట్ల బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది, సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి కానీ క్లైమాక్స్ లో గ్రాఫిక్స్ కొంచం నాసిరకంగా ఉన్నాయి… తెలుగు డబ్బింగ్ బాగుంది, డైలాగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక మణిరత్నం డైరెక్షన్ విషయానికి వస్తే….

కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కంప్లీట్ గా తమిళ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసిన కథ, కథ పరంగా అద్బుతంగానే  ఉన్నప్పటికీ కూడా చెప్పిన విధానం అండ్ టేకింగ్ కంప్లీట్ గా తమిళ్ ఆడియన్స్ కి బాగానే నచ్చుతాయి కానీ ఇతర భాషల ఆడియన్స్ కి నచ్చే అవకాశం అంతంతమాత్రమే… అయినా కానీ కొంచం ఓపిక చేసుకుని చూస్తె…..

టేకింగ్ బాగుండటం, స్టార్ కాస్ట్ బాగుండటం మరియు కొన్ని సీన్స్ బాగానే రావడంతో ఓవరాల్ గా సినిమా పర్వాలేదు అనిపించవచ్చు. బాహుబలి లాంటి సిరీస్ లో ఉండే అబ్బుర పరిచే రేంజ్ లో ఎలివేషన్స్ లేకపోవడం మేజర్ డ్రా బ్యాక్… సినిమాలో అలాంటి సీన్స్ కి స్కోప్ ఉన్నా కానీ చాలా నార్మల్ గానే తీశారు మణిరత్నం…

మొత్తం మీద సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ, స్టార్ కాస్ట్ అలాగే రెహమాన్ బ్యాగ్రౌండ్ బాగుండటం మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే… స్లో నరేషన్, హై ఫీల్ ఇచ్చే మూమెంట్స్ లేక పోవడం, లెంత్ మరీ ఎక్కువ అవ్వడం లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్… మొత్తం మీద సినిమా తమిళ్ ఆడియన్స్ వరకు ఎలా ఉన్నా పర్వాలేదు బాగుంది అనిపించవచ్చు కానీ…

ఇతర భాషల ఆడియన్స్ కి పొన్నియన్ సెల్వన్ నవల గురించి తెలిసి ఉంటె సినిమా పర్వాలేదు అనిపించవచ్చు, ఇతర ఆడియన్స్ బాహుబలి రేంజ్ లో అంచనాలు పెట్టుకుంటే మట్టుకు సినిమా నిరాశ పరచడం ఖాయం. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకి వెళ్ళినా కొన్ని సీన్స్ మినహా సినిమా పెద్దగా ఇంప్రెస్ అయితే చేయలేదు… ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here