Home న్యూస్ గాడ్ ఫాదర్ ట్రైలర్ రివ్యూ….కుమ్మింది కానీ!!

గాడ్ ఫాదర్ ట్రైలర్ రివ్యూ….కుమ్మింది కానీ!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రిలీజ్ అయ్యింది, మెగాస్టార్ కి తోడూ ఓ స్పెషల్ రోల్ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో కనిపిస్తున్న ఈ సినిమా అక్కడ కూడా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఇక ట్రైలర్ చూసిన తర్వాత ఓవరాల్ గా…

రెస్పాన్స్ చెప్పాలి అంటే మిక్సుడ్ ఫీలింగ్స్ అని చెప్పాలి. చిరంజీవి లుక్ బాగుండటం, స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకోవడం, డైలాగ్స్ బాగుండటం, సల్మాన్ సీన్స్ ఎక్స్ లెంట్ గా రావడం, టేకింగ్ అండ్ విజువల్స్ చాలా బాగా ఉండటం లాంటివి ట్రైలర్ లో బాగానే మెప్పించాయి…

కానీ అదే టైం లో స్టొరీ పాయింట్ ని యాసిటీస్ ఒరిజినల్ లో ఉన్నట్లే ఒక క్యారెక్టర్ ని తప్పించి మిగిలింది అంతా అలానే ఉంచారు అనిపించేలా ట్రైలర్ కట్ చేశారు. ఇక ట్రైలర్ ఇంపాక్ట్ ని తగ్గించిన్ మరో అంశం తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్…. అతి సాధారమైన బ్యాగ్రౌండ్ స్కోర్ తో….

ట్రైలర్ కట్ బాగున్నా కానీ ఆ ట్రైలర్ ను మరో లెవల్ కి తీసుకెళతాడు అనుకున్నా చాలా నార్మల్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో నిరాశ పరిచాడు. ఓవరాల్ గా ట్రైలర్ చూసిన తర్వాత ఆచార్య కన్నా చాలా బెటర్ రిజల్ట్ నే ఈ సినిమా ఇస్తుందని అందరూ ఆశిస్తున్నారు…. ఇక ట్రైలర్ లో నయనతార, సత్యదేవ్, సముద్రఖని, సునీల్ ఇలా కీలక రోల్స్ లో నటించారు…

మొత్తం మీద ట్రైలర్ ఇప్పటి వరకు సినిమా పై ఉన్న అంచనాలను అయితే పెంచింది అని చెప్పాలి. ట్రైలర్ ఎండింగ్ లో సల్మాన్ ఖాన్ ఒకరిని నరికి ఆ కత్తిని నోట్లో పెట్టుకుని చిరుకి బాడీ గార్డ్ లా గర్వంగా నడుస్తూ వచ్చిన సీన్ కూడా ఓ రేంజ్ లో కిక్ ఇచ్చింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అక్టోబర్ 5న ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here