లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో దూసుకు పోతుంది కీర్తి సురేష్… మహానటి సినిమా తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టడమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో హైయెస్ట్ షేర్ వసూల్ చేసిన సినిమాగా సంచలన రికార్డ్ ను సొంతం చేసుకోగా తర్వాత ఎక్కువగా ఇలాంటి కాన్సెప్ట్ బేస్ మూవీస్ నే ఒప్పుకుంటుంది కీర్తి సురేష్… అందులో పెంగ్విన్, గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా లాంటి సినిమాలు వరుస పెట్టి…
కమిట్ అవ్వడమే కాకుండా దాదాపుగా షూటింగ్ కూడా పూర్తీ చేసుకున్నాయి. వీటిలో ముందుగా పెంగ్విన్ సినిమా రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ దక్కించుకుని మిక్సుడ్ టాక్ తెచ్చుకున్నా కానీ భారీ లెవల్ లో ట్రెండ్ అయిన సినిమాగా ఎక్కువ మంది జనాలు చూసిన సినిమా గా నిలిచి దుమ్ము లేపింది.
ఇక తర్వాత కీర్తి సురేష్ నటించిన కొత్త సినిమా గుడ్ లక్ సఖి ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా లాంచ్ చేయగా టీసర్ ని కూడా రిలీజ్ చేశారు. టీసర్ ప్రామిసింగ్ గా ఉండగా సినిమాను కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి ఇప్పుడు సిద్ధం చేస్తున్నారనే టాక్ ఉంది.
కాగా రీసెంట్ మూవీ పెంగ్విన్ కి ఓవరాల్ గా 7.5 కోట్ల రేటు దక్కిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు గుడ్ లక్ సఖి సినిమా కి ఓవరాల్ గా అన్ని భాషల్లో కలిపి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి గాను 10 కోట్ల రేంజ్ ఆఫర్ దక్కుతుందని సమాచారం. ఇది పెంగ్విన్ కన్నా ఎక్కువ అవ్వడం తో…
యూనిట్ కూడా ఇప్పుడు సినిమాను అమ్మేసే ఆలోచనలో ఉన్నారని టాక్ ఉండగా రేటు కొంచం పెంచి 12 కోట్లకు ఫిక్స్ చేస్తే బాగుంటుంది అన్న ప్రపోజల్ చేశారని ట్రేడ్ లో టాక్ వినిపిస్తుంది. మరి ఇది నిజం అయ్యి డీల్ కంప్లీట్ అయితే త్వరలో ఈ సినిమా కూడా డైరక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు…