అసలు ఏమాత్రం ఊహించని కాంబినేషన్ లో సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి కాంబో నే సెట్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు డైరెక్టర్ శ్రీవాస్ అంటూ టాలీవుడ్ లో వార్తలు ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతుంది, మాచో హీరో గోపీచంద్ సినిమాల స్టైల్ వేరు, అదే టైం లో యాంగ్రీ హీరో రాజశేఖర్ సినిమాల స్టైల్ వేరు… ప్రస్తుతం ఇద్దరూ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ దూరంగా ఉన్నారు అది వేరే విషయం…
కానీ ఇప్పుడు వీళ్ళ కలయికలో ఒక మల్టీ స్టారర్ మూవీ రూపొందబోతుంది అంటున్నారు ఇప్పుడు. డైరెక్టర్ శ్రీవాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర గోపీచంద్ మరియు జగపతిబాబు ల కాంబినేషన్ లో కెరీర్ స్టార్టింగ్ లో లక్ష్యం అనే అద్బుతమైన మల్టీ స్టారర్ ని రూపొందించారు….
పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా ఓ రేంజ్ లో కలెక్షన్స్ వర్షం కురిపించింది, మళ్ళీ గోపీచంద్ వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో లౌక్యం సినిమా తో బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చారు, ప్రస్తుతం కూడా గోపీచంద్ పరిస్థితి ఆల్ మోస్ట్ అలానే ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర…
లౌక్యం తర్వాత క్లీన్ హిట్ ఇప్పటి వరకు దక్కలేదు, ఇక హీరో రాజశేఖర్ కూడా గరుడవేగ, కల్కి లాంటి మంచి సినిమాలు పడ్డా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర వాటితో హిట్ అందుకోలేదు. ఇక డైరెక్టర్ శ్రీవాస్ చేసిన సాక్ష్యం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయ్యింది. ఇలాంటి టైం లో శ్రీవాస్ రాసుకున్న లక్ష్యం రేంజ్ పవర్ ఫుల్ స్టొరీ ని…
ఇటు గోపీచంద్ కి అటు రాజశేఖర్ కి వినిపించారని సమాచారం. ఇద్దరూ ఓకే చెప్పిన వెంటనే సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయాలనీ చూస్తున్నారని టాలీవుడ్ లో వార్తలు శిఖారు చేస్తున్నాయి. ఒకవేళ వీళ్ళ కాంబినేషన్ సెట్ అయితే రాజశేఖర్ కి మంచి కంబ్యాక్ గా నిలుస్తుంది. లక్ష్యం తర్వాత మరో మంచి మల్టీ స్టారర్ మూవీ అవుతుందని చెప్పొచ్చు. మరి ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి ఇక…