మ్యాచో హీరో గోపీచంద్ మరియు నయనతారల కాంబినేషన్ లో బి గోపాల్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా ఆరడుగుల బుల్లెట్, ఎప్పుడో 4 ఏళ్ల క్రితమే కంప్లీట్ షూటింగ్ ను పూర్తీ చేసుకున్న ఈ సినిమా ను ఎప్పటి నుండో థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ ట్రై చేస్తున్నప్పాటికీ కూడా చివరి నిమిషం లో ఎదో ఒక అడ్డంకి వస్తూ ఉండటం తో సినిమా ఎప్పటి కప్పుడు రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.
ఇలాంటి టైం లో లాస్ట్ ఇయర్ ఈ సినిమా ను డిజిటల్ రిలీజ్ చేయాలనీ కొన్ని OTT యాప్స్ తెగ ట్రై చేశాయి కానీ ముందు మేకర్స్ నో చెప్పి తర్వాత ఓకే అన్నా కూడా రేటు దిగుతూ వచ్చింది. ముందు 12 కోట్ల దాకా రేటు ఆఫర్ వచ్చినా కానీ తర్వాత రేటు తగ్గుతూ…
తగ్గుతూ మొత్తం మీద 6 కోట్ల లోపు ఆఫర్స్ మాత్రమే వచ్చాయి, ఇక తర్వాత ఫస్ట్ వేవ్ అయిపోవడం తో సినిమాలు వరుస పెట్టి థియేటర్స్ లో రిలీజ్ అవుతూ రాగా గోపీచంద్ సీటి మార్ కనుక అంచనాలను అందుకుంటే ఈ సినిమా కి మోక్షం వస్తుందని ఆశించారు.
కానీ మళ్ళీ సెకెండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడం తో అన్ని సినిమాల రిలీజ్ లు ఆగిపోగా సీటి మార్ కూడా ఆగిపోగా మళ్ళీ డైరెక్ట్ రిలీజ్ కి ఆఫర్స్ పెరగడం మొదలు అయింది, ఇక అందులో భాగంగా గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ సినిమా కి గాను తిరిగి 10 కోట్ల రేంజ్ లో డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ వస్తున్నాయట. సినిమాను మొత్తం మీద 15 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించగా అప్పులతో కలిపి…
ఇప్పుడు టోటల్ లెక్క 18.5 కోట్ల దాకా అయ్యిందని సమాచారం. ఈ లెక్కన ఈ ఆఫర్ తక్కువే అని చెప్పొచ్చు. దాంతో మేకర్స్ ఇంకా బెటర్ ఆఫర్ ఏమైనా వస్తే ఈ సారి డిలే చేయకుండా సినిమాను అమ్మాలని చూస్తున్నారట. మరి ఈ సారైనా సినిమా డీల్ సెట్ అవుతుందో లేదో చూడాలి.