మాస్ హీరో గోపీచంద్ నటించిన సినిమాల్లో ఇప్పటి వరకు ఏ సినిమా కి జగరనిది జరుగుతుంది మాత్రం ఒక్క సినిమాకే అని చెప్పాలి, మూడేళ్ళ క్రితం రిలీజ్ అవ్వాల్సిన ఆ సినిమా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ అనవసరపు ఇబ్బందులను గోపీచంద్ కి కలిగిస్తూ వస్తుండగా అసలు ఆ సినిమాను పట్టించుకోవడమే మానేశాడు గోపీచంద్. ఆ సినిమానే ఆరడుగుల బుల్లెట్.. పవర్ ఫుల్ టైటిల్ తో గోపీచంద్ నయనతారల కాంబినేషన్ లో…
ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన డైరెక్టర్ బి గోపాల్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా కోసం సుమారు 15 కోట్ల మేర ఖర్చు చేశారు. కానీ ఏవేవో ఇబ్బందుల వలన సినిమా ఆల్ మోస్ట్ రిలీజ్ అయినట్లే అయ్యి మళ్ళీ పోస్ట్ పోన్ అవుతూ రాగా కరోనా టైం లో అయినా సినిమాను…
బాక్స్ ఆఫీస్ దగ్గర కుదరకపోయినా డైరెక్ట్ రిలీజ్ చేయాలనీ భావించినా కానీ రేట్లు ఏమి అనుకున్నట్లు రావడం లేదు. ముందు సినిమా బడ్జెట్ లో సగం రేట్ల దాకా వచ్చినా యూనిట్ నో చెప్పగా తర్వాత రేట్లు మరింతగా తగ్గుముఖం పట్టి రీసెంట్ గా 4 నుండి 4.5 కోట్ల..
లోపే ఆఫర్స్ వస్తూ ఉండగా యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు… కానీ ఇది జరిగిన తర్వాత రీసెంట్ గా మళ్ళీ సినిమా వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టగా అమెజాన్ ప్రైమ్ వాళ్ళు సినిమాను కొనడానికి ముందుకు వచ్చి 5 కోట్ల దాకా రేటు ని ఇప్పుడు ఇవ్వడానికి ఓకే అన్నట్లు చెప్పారని సమాచారం. దాంతో ఉన్నంతలో మిగలిన ఆఫర్స్ తో..
పోల్చితే ఈ ఆఫర్ బెస్ట్ ఆఫర్ అని విశ్లేషకులు చెబుతున్నారు. అమెజాన్ లో సినిమా పెట్టిన అమౌంట్ ని రికవరీ చేస్తే తర్వాత నెలకోసారి వ్యూస్ ని బట్టి కూడా నిర్మాతలకు డబ్బులు ఇస్తారు. కానీ ప్రస్తుతానికి 10 కోట్ల నష్టం తో సినిమాను రిలీజ్ చేయాల్సి ఉంటుంది, మరి ఈ సారి అయినా ఎదో ఒక నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి మరి…