యాక్షన్ హీరో గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది, కెరీర్ లో చేసిన సినిమాల్లో కొన్ని మంచి విజయాలుగా నిలిచినా కొన్ని మాత్రం అంచనాలను అందుకోలేదు. ముఖ్యంగా రీసెంట్ మూవీస్ అన్ని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేక పోయాయి. అప్పుడెప్పుడో సాహసం మరియు లౌక్యం లాంటి సినిమాలతో బాక్ టు బాక్ హిట్స్ కొట్టాడు గోపీచంద్…
తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు క్లీన్ హిట్ సినిమా పడక పోయినా కానీ గోపీచంద్ సినిమాలకు నిర్మాతలు భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. దానికి కారణం థియేట్రికల్ గా ఫెయిల్ అయినా కానీ సినిమాలు నాన్ థియేట్రికల్ బిజినెస్ ను బాగా జరుగుతూ ఉండటం..
శాటిలైట్ డిజిటల్ రైట్స్ కి మంచి రేట్లు వస్తూ ఉండటం తో హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా సాలిడ్ బడ్జెట్ తోనే గోపీచంద్ సినిమాలు రూపొందుతూ ఉన్నాయి, రీసెంట్ గా గోపీచంద్ నటిస్తున్న కొత్త సినిమా సీటిమార్ కూడా 22 కోట్లకు తగ్గని బడ్జెట్ తో రూపొందుతూ ఉండగా…
ఈ సినిమా తర్వాత గోపీచంద్ ఒప్పుకున్నా క్రేజీ మూవీ మారుతి డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో చేస్తున్న కొత్త సినిమా కి కూడా సాలిడ్ బడ్జెట్ పెట్టబోతున్నారు అన్న టాక్ ఉంది, అక్టోబర్ 1 న రిలీజ్ కాబోతుంది అంటున్న ఈ సినిమా కోసం కూడా ఏకంగా… 25 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ని కేటాయించారు అని అంటున్నారు. ఆ రేంజ్ లో బడ్జెట్ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.
ఇన్ని ఫ్లాఫ్స్ పడుతున్నా కానీ గోపీచంద్ మూవీస్ కి ఇలాంటి బడ్జెట్లు దొరుకుతూ ఉండటం విశేషం అనే చెప్పాలి. ఇక మారుతి కూడా హిట్ డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా గోపీచంద్ సాలిడ్ గా ఫామ్ లోకి వచ్చే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. మరి అక్టోబర్ 1 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తో గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా దుమ్ము లేపుతాడో చూడాలి.