మాచో స్టార్ గోపీచంద్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ పడి చాలా ఏళ్ళు అయిపోయింది. 2014 టైంలో లౌక్యం సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ హిట్ గీతని అందుకోలేదు. సీటిమార్ సినిమా కొంచం క్లోజ్ గా వచ్చినా హిట్ గీతని దాటలేదు. ఇక తర్వాత చేసిన పక్కా కమర్షియల్ అలాగే రీసెంట్ గా చేసిన రామ బాణం సినిమాలు…
భారీగా నిరాశ పరిచాయి. రామబాణం సినిమా అయితే తనకి లక్ష్యం లౌక్యం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన శ్రీవాస్ డైరెక్షన్ లో వచ్చినా కూడా మినిమమ్ బజ్ ను కూడా సొంతం చేసుకోలేక పోయింది. దాంతో కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక పోయిన ఈ సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ డిసాస్టర్ గా నిలిచింది. గోపీచంద్ సినిమాలకు హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ మంచి రేటుని సొంతం చేసుకుంటూ ఉండటంతో రెమ్యునరేషన్ కూడా చాలా వరకు గానే ఉంటూ వస్తుంది… ఈ సినిమా కి కూడా వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్నా కూడా…
ఆల్ మోస్ట్ 5.5 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని గోపీచంద్ తీసుకున్నాడని అంటున్నారు ఇండస్ట్రీ లో. ఫ్లాఫ్స్ లో ఉన్న హీరోకి ఈ రేంజ్ రెమ్యునరేషన్ దక్కడం కూడా విశేషం అనే చెప్పాలి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గరే గోపీచంద్ మళ్ళీ ఓ భారీ బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ని ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.