Home గాసిప్స్ అక్షరాలా 20 కోట్లు…సాలిడ్ షాక్ ఇది!!

అక్షరాలా 20 కోట్లు…సాలిడ్ షాక్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ హీరో గోపీచంద్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది… 2014 లో లౌక్యం సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ తర్వాత చేసిన జిల్ తో పర్వాలేదు అనిపించుకున్నాడు. కానీ తర్వాత చేసిన ప్రతీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నిరాశనే మిగిలించింది. సౌఖ్యం, గౌతమ్ నంద, ఆక్సీజన్, పంతం మరియు చాణక్య సినిమాలు అన్నీ నిరాశ పరచగా ఇందులో గౌతమ్ నంద…

మంచి టాక్ నే సొంతం చేసుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని మాత్రం అందుకోలేక పోయింది. ఇలా వరుస ఫ్లాఫుల్లో ఉన్నా కానీ గోపీచంద్ అప్ కమింగ్ మూవీస్ కి మంచి బడ్జెట్ అండ్ ప్రొడ్యూసర్లు దొరుకుండటం విశేషం అనే చెప్పాలి.

లేటెస్ట్ గా చేస్తున్న సినిమాలు అన్నీ కూడా మంచి బడ్జెట్ తో లావిష్ గానే తెరకేక్కుతున్నాయి. తనతో గౌతమ్ నంద చేసిన సంపత్ నంది డైరెక్షన్ లో తమన్నా హీరోయిన్ గా చేస్తున్న లేటెస్ట్ మూవీ సీటిమార్ ముందు లో బడ్జెట్ మూవీ అని వార్తలు వచ్చాయి కానీ ఈ సినిమాకి కూడా ఇప్పుడు…

20 నుండి 22 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందుతుందని సమాచారం. రీసెంట్ గోపీచంద్ మూవీస్ అన్నీ కూడా ఫ్లాఫ్ టాక్ వలన 10 కోట్లకు అటూ ఇటుగానే కలెక్షన్స్ ని అందుకున్నాయి. అయినా కానీ మళ్ళీ ఇంత బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా అంచనాలను ఎంతవరకు అందుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే తిరిగి రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకొబోతున్న ఈ సినిమాను…

వచ్చే ఏడాది మొదట్లోనే రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిజల్ట్ ని పక్కకు పెట్టి తన అప్ కమింగ్ మూవీస్ కూడా ఇదే రేంజ్ బడ్జెట్ తో చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర గోపీచంద్ ఒక్క హిట్ కొట్టి కంబ్యాక్ ఇస్తే ఈ బడ్జెట్ ని రికవరీ చేయడం పెద్ద కష్టం కాదని నిర్మాతల నమ్మకం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here