బాక్స్ ఆఫీస్ దగ్గర మాచో మాన్ గోపీచంద్ హిట్ కొట్టి చాలా ఏల్లె అవుతుంది, అప్పుడెప్పుడో 2014 లో లౌక్యం సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న గోపీచంద్ తర్వాత కెరీర్ లో మరో హిట్ ని ఇప్పటి వరకు సొంతం చేసుకోలేక పోయాడు, మధ్యలో గౌతమ్ నంద లాంటి హిట్ అవ్వాల్సిన సినిమాలు కూడా గోపీచంద్ ఫ్లాఫ్ ట్రాక్ వలన బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అవ్వాల్సి వచ్చింది.
ఇలాంటి టైం లో కూడా గోపీచంద్ సినిమాలకు నిర్మాతలు ఇప్పటికీ భారీ బడ్జెట్ లను పెడుతూ ఉండటం విశేషం అనే చెప్పాలి, గోపీచంద్ ఇప్పుడు గౌతమ్ నంద డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్ లో తమన్నా హీరోయిన్ గా చేస్తున్న లేటెస్ట్ మూవీ సీటిమార్ అన్నీ…
అనుకున్నట్లు జరిగి ఉంటే ఏప్రిల్ ఎండ్ టైం లో రిలీజ్ అవ్వాల్సింది కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన రిలీజ్ కాన్సిల్ అవ్వగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని టాలీవుడ్ లో స్ట్రాంగ్ బజ్ నెలకొంది, ఈ సినిమా టోటల్ రైట్స్ ని…
జీ నెట్ వర్క్ వాళ్ళు సొంతం చేసుకున్నారని సమాచారం, ఆల్ మోస్ట్ 26 కోట్ల మమ్మోత్ రేటు పెట్టి కంప్లీట్ రైట్స్ ని తీసుకున్నారట, అంటే థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి ఈ రేటు పెట్టగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ లో పే పెర్ వ్యూ పద్దతిలో రెండు వారాల పాటు రిలీజ్ చేసి తర్వాత జీ 5 యాప్ లో రిలీజ్ చేసే…
ఆలోచన చేస్తున్నారని లేటెస్ట్ టాలీవుడ్ టాక్, జీ వాళ్ళు రీసెంట్ సల్మాన్ ఖాన్ రాధే ని ఇలానే రిలీజ్ చేసి సాలిడ్ ప్రాఫిట్స్ నే సొంతం చేసుకున్నారు, దాంతో ఇప్పుడు గోపీచంద్ సీటిమార్ విషయం లో కూడా ఇదే రూల్ ని ఫాలో అవ్వాలని చూస్తున్నారట, మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో అలాగే వర్కౌట్ అవుతుందో అన్నది ఆసక్తి కరం అని చెప్పొచ్చు.