Home న్యూస్ గోపీచంద్ విశ్వం ట్రైలర్ రివ్యూ…..శ్రీనువైట్ల మార్క్ కనిపించింది…కానీ!!

గోపీచంద్ విశ్వం ట్రైలర్ రివ్యూ…..శ్రీనువైట్ల మార్క్ కనిపించింది…కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ కి దూరంగా ఉన్న వాళ్ళలో మాచో స్టార్ గోపీచంద్(Gopichand) మరియు శ్రీనువైట్ల(Sreenu Vaitla) లు ముందు నిలుస్తారు…ఒకప్పుడు మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న గోపీచంద్ హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది, ఇక ఒకప్పుడు టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచిన శ్రీనువైట్ల పూర్తిగా ఫామ్ కోల్పోయారు…

ఇలాంటి టైంలో వీళ్ళ కాంబోలో భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie Trailer Review) ఆడియన్స్ ముందుకు ఈ దసరా కానుకగా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉంది…ఇక సినిమా నుండి రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు…

ట్రైలర్ చూసిన తర్వాత టిపికల్ శ్రీనువైట్ల మార్క్ సీన్స్ అయితే ఉన్నాయనిపించింది అని చెప్పాలి…ట్రైలర్ స్టార్టింగ్ లో సీరియస్ సబ్జెక్ట్ గా అనిపిస్తూ మొదలైన విశ్వం ట్రైలర్, హీరో ఇంట్రో ఒక పెద్ద ఇష్యూతో స్టార్ట్ అయ్యి సడెన్ గా కామెడీ టర్న్ తీసుకుని…

హీరోయిన్ ఎంట్రీ, తన ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ తో హీరో పరిచయం, ఒక ట్రైన్ జర్నీ అక్కడ అందరూ కలిసి కామెడీ ట్రై చేయడంతో ఓకే అనిపించి మళ్ళీ సీరియస్ టర్న్ తీసుకున్న ట్రైలర్ పర్వాలేదు అనిపించేలా ముగుసి..కొంచం దూసుకు, బాద్ షా లాంటి సినిమాలను గుర్తు చేశాయి…

మరీ కామెడీ ట్రైలర్ లో ఓ రేంజ్ లో పండినట్లు అయితే అనిపించలేదు కానీ కొన్ని షాట్స్ పర్వాలేదు అనిపించేలా ఉండగా, విజువల్స్ చాలా రిచ్ గానే ఉండటం, గోపీచంద్ పవర్ ఫుల్ రోల్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ పరంగా కూడా ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ మరోసారి రెగ్యులర్ రొటీన్ మూవీ లానే అనిపించింది ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత…

ట్రైలర్ ఎలా ఉన్నా సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ ను మెప్పించే రేంజ్ లో కనుక సినిమా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా హాలిడేస్ లో మినిమమ్ కలెక్షన్స్ తో జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. మరి ఈ సినిమాతో అయినా గోపీచంద్ శ్రీనువైట్లలు కంబ్యాక్ ను సొంతం చేసుకుంటారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here