Home గాసిప్స్ హిట్ కొట్టి 10 ఏళ్ళు…అయినా గోపీచంద్ విశ్వం హిందీ డబ్బింగ్ రేటు ఎంతో తెలుసా!!

హిట్ కొట్టి 10 ఏళ్ళు…అయినా గోపీచంద్ విశ్వం హిందీ డబ్బింగ్ రేటు ఎంతో తెలుసా!!

0

మాచో స్టార్ గోపీచంద్(Gopichand) బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఆల్ మోస్ట్ 10 ఏళ్ళ క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన లౌక్యం(Loukyam Movie) తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్, ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఒక్క హిట్ మూవీ కూడా తన ఖాతాలో పడలేదు…

రీసెంట్ మూవీ భీమా(Bhimaa Movie) కూడా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది…ఇలాంటి టైంలో గోపీచంద్ తన కొత్త మూవీని వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న శ్రీను వైట్ల(Sreenu Vaitla) డైరెక్షన్ లో చేస్తూ ఉండగా రీసెంట్ గా సినిమా కి విశ్వం(Vishwam) అనే టైటిల్ ను కన్ఫాం చేశారు…. టైటిల్ రివీల్ టీసర్ కి…

ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే లా రెస్పాన్స్ సొంతం అవ్వగా ఇంకా రిలీజ్ ఎప్పుడో కన్ఫాం అవ్వని ఈ సినిమా బిజినెస్ పరంగా మాత్రం ఇప్పటి నుండే జోరు చూపిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి…. వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా గోపీచంద్ మూవీస్ కి నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ సాలిడ్ గానే జరుగుతూ ఉండగా…

ఇప్పుడు విశ్వం మూవీకి నాన్ థియేట్రికల్ బిజినెస్ ఆఫర్స్ కూడా భారీగా వస్తూ ఉండగా రీసెంట్ గా హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ సాలిడ్ రేటుకి అమ్ముడు పోయినట్లు టాక్ స్ట్రాంగ్ గా వినిపిస్తుంది…మొత్తం మీద సినిమాకి హిందీ డబ్బింగ్ రైట్స్ కిందా 10 కోట్ల రేంజ్ లో రేటు సొంతం అయ్యిందట…

వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా విశ్వం సినిమాకి ఇలాంటి రేటు సొంతం అవ్వడం విశేషం అనే చెప్పాలి. శ్రీను వైట్ల కూడా చాలా కాలంగా కంబ్యాక్ కోసం ఎదురు చూస్తూ ఉండగా వీళ్ళ కాంబోలో వస్తున్న ఈ సినిమాతో ఇద్దరూ ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటారో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here