బాక్స్ ఆఫీస్ దగ్గర గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తొలిరోజు అనుకున్న కలెక్షన్స్ కన్నా కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది ఈ సినిమా… 2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ ఏకంగా 2.62 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని అంచనాలను మించి పోయింది సినిమా…
సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూసిన తర్వాత మినిమమ్ ఓపెనింగ్స్ ని అయినా సొంతం చేసుకుంటుందో లేదో అన్న అనుమానాలు ఏర్పడ్డాయి. దానికి తోడూ లాస్ట్ ఇయర్ వచ్చిన సీటిమార్ తో పోల్చితే పక్కా కమర్షియల్ మాస్ మూవీ కూడా కాదు. దాంతో సినిమా ఓపెనింగ్స్ అండ్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అంతంతమాత్రమె ఉండేలా అనిపించగా…
తొలిరోజు కలెక్షన్స్ మాత్రం ఎక్స్ లెంట్ గా ఉండటం, 2 కోట్లు అనుకుంటే ఏకంగా 2.62 కోట్ల ఓపెనింగ్స్ ని సినిమా అందుకోవడం రిమార్కబుల్ అనే చెప్పాలి. అదే సినిమా బెటర్ మ్యూజిక్ అండ్ ఇంకా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండి ఉంటె కచ్చితంగా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ నే సొంతం చేసుకుని ఉండేది. మొత్తం మీద ఆడియన్స్ లో ఇప్పటికీ గోపీచంద్ సినిమాలు అంటే క్రేజ్ అయితే ఉందని చెప్పాలి. ఇక గోపీచంద్ ఎంచుకునే సినిమాలు బాగుంటే కలెక్షన్స్ కూడా దక్కించుకునే అవకాశం ఉంటుంది.