టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Sreenivas) ల క్రేజీ కాంబోలో ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram), ట్రైలర్ అండ్ కుర్చీ మడతపెట్టి సాంగ్ తో హైప్ సాలిడ్ గా పెరిగి పోయిన ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది…
మరి ఎంతవరకు ఆ అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే….తల్లి తండ్రులు గొడవల వలన విడిపోతారు, కొడుకుని తండ్రికే అప్పగించి తన తండ్రితో కలిసి ఉంటుంది తల్లి రమ్యకృష్ణ, మరో వ్యక్తితో పెళ్లి చేసుకుని రాజకీయాల్లో అడుగు పెడుతుంది…
అలా ఏళ్ళు గడుస్తాయి, గుంటూరులో పెరిగి పెద్దవుతాడు హీరో, తర్వాత తన కూతురు పొలిటికల్ లైఫ్ కి కొడుకు ఎక్కడ అడ్డు పడతాడో అని రమ్యకృష్ణ తండ్రి ప్రకాష్ రాజ్ మనవడిని హైదరాబాదు పిలిపించి తన ఫ్యామిలీతో ఎలాంటి సంభందం లేదని ఒక సైన్ చేయమంటాడు… మరి హీరో ఏం చేశాడు…ఆ తర్వాత ఏమయింది అన్నది అసలు సిసలు కథ….
Guntur Kaaram Review And Rating
చాలా అంటే చాలా తిన్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం, ఆ పాయింట్ ని 3-4 సీన్స్ లో చెప్పేయొచ్చు, కానీ రెండున్నర గంటల సినిమాగా తీయడం అన్నది చాలా చాలా కష్టం, కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రెండున్నర గంటల్లో సినిమా కోసం ఏమేమి చేయాలో అన్నీ చేశాడు, కామెడీ సీన్స్ లో తన మార్క్ చూపించాడు…
కెరీర్ లో ఎప్పుడూ లేనంత ఎనర్జీతో ఎక్స్ లెంట్ డాన్స్ మూమెంట్స్ చేశాడు, మాస్ ఆడియన్స్ కోసం ఫైట్ సీన్స్ తో రెచ్చిపోయాడు, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సెంటిమెంట్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు…. కానీ ఓవరాల్ గా మహేష్ సినిమా కోసం ఎంత చేసినా కూడా అసలు కథనే తిన్ స్టోరీతో ఉండటంతో మహేష్ శ్రమ వృదా అయింది…
శ్రీలీల డాన్స్ లకే పరిమితం అవ్వగా మీనాక్షి చౌదరి రోల్ జస్ట్ ఓకే అనిపిస్తుంది, రమ్యకృష్ణ రోల్ పర్వాలేదు అనిపించగా, ప్రకాష్ రాజ్, రావ్ రమేష్ మిగిలిన యాక్టర్స్ కూడా చాలా మందే ఉన్నా ఎవ్వరికీ పెద్దగా స్కోప్ లేకుండా అపోయింది, ఉన్నంతలో వెన్నెల కిషోర్ కామెడీ కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించేలా ఉందని చెప్పాలి.
త్రివిక్రమ్ అనుకున్న పాయింట్ చాలా వీక్ గా ఉండటంతో కథని సాగదీశాడు, ఒక స్టేజ్ వరకు పర్వాలేదు కానీ తర్వాత చెప్పడానికి కథ లేక పోవడంతో ఏవేవో సీన్స్ తో నింపేశాడు….మహేష్ ను ఉన్నంతలో ఎక్స్ లెంట్ గా ప్రజెంట్ చేసినా కూడా కథలోనే లోసగులు ఉండటంతో పెద్దగా త్రివిక్రమ్ మ్యాజిక్ కనిపించలేదు….
ఇక తమన్ అందించిన పాటలు పర్వాలేదు అనిపించగా కుర్చీ మడతపెట్టి మాత్రం థియేటర్స్ షేక్ అయ్యేలా ఉంది, కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా జస్ట్ ఓకే అనిపించాడు తమన్, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే జస్ట్ ఓకే అనిపించేలా ఉంది, సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి… మొత్తం మీద సినిమాలో…
మహేష్ బాబు వన్ మ్యాన్ షో, కుర్చీ మడతపెట్టి సాంగ్, శ్రీలీల డాన్స్ మూమెంట్స్ మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వీక్ గా ఉండటం, మెలోడ్రామా పెద్దగా పండకపోవడం మేజర్ డ్రా బ్యాక్స్ అని చెప్పాలి. అయినా కానీ మహేష్ బాబు కోసం తన ఎనర్జీ కోసం కొంచం ఓపిక చేసుకుని చూస్తె పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది గుంటూరు కారం…మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్…