Home న్యూస్ హనుమాన్ రివ్యూ-రేటింగ్….హిట్టు బొమ్మ బాస్!!

హనుమాన్ రివ్యూ-రేటింగ్….హిట్టు బొమ్మ బాస్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో పేరుకు చిన్న సినిమానే అయినా కూడా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న సినిమా హనుమాన్(Hanuman) చాలా తక్కువ బడ్జెట్ లో ఎక్స్ లెంట్ క్వాలిటీతో వచ్చిన హనుమాన్ మూవీ ఆడియన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే ఊర్లో అల్లరి చిల్లరగా తిరిగే హీరో, అనుకోకుండా హీరోయిన్ ని కాపాడే క్రమంలో చావు దాకా వెళ్లోచ్చిన హీరోకి ఒక అద్బుత శక్తి లభిస్తుంది… మరో వైపు సూపర్ హీరో అవ్వాలి అనుకుని విలన్ గా మారిపోయిన విలన్ కి హీరో దగ్గర అద్బుత శక్తి ఉందని తెలుస్తుంది…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా స్టోరీ పాయింట్….

ఆడియన్స్ ముందుకు రీసెంట్ టైంలో వచ్చిన భారీ బడ్జెట్ విజువల్ వండర్ మూవీస్ తో పోల్చుకుంటే చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ విజువల్స్ పరంగా పెద్ద బడ్జెట్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విజువల్స్ తో మెప్పించింది… ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తేజ సజ్జ(Teja Sajja) తన రోల్ వరకు…

HanuMan Movie Telugu Review and Rating
చాలా బాగా నటించి మెప్పించగా తనకి కొన్ని హీరోయిజం సీన్స్ కూడా బాగా పడ్డాయి, వాటిని తను బాగా క్యారీ చేశాడు కూడా… హీరోయిన్ రోల్ పర్వాలేదు అనిపించగా సిస్టర్ రోల్ లో వరలక్ష్మీ బాగా నటించి మెప్పించింది… విలన్ కూడా పర్వాలేదు అనిపించాడు. మిగిలిన యాక్టర్స్ తమ తమ రోల్స్ లో ఆకట్టుకున్నారు..

సంగీతం సినిమా టోన్ కి తగ్గట్లు పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని ఎలివేషన్ సీన్స్ కి ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేసింది…ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచం పడుతూ లేస్తూ సాగినా కూడా చాలా వరకు సినిమా ఎక్కడా కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ఉండటం విశేషం. సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉండగా విజువల్స్..

బడ్జెట్ కి ఎన్నో రెట్లు మించి ఉన్నాయి,ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్చ్ అనిపించేలా ఉండగా ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma), తన దగ్గర ఉన్న లిమిటెడ్ బడ్జెట్ కి ఎన్నో రెట్లు మించిపోయే రేంజ్ ఔట్ పుట్ ఇచ్చాడు. ఫస్టాఫ్ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయినా తర్వాత కొంచం అప్ అండ్ డౌన్స్ తోకథ సాగినా ఈ గ్యాప్ లో కామెడీ సీన్స్ తో మెప్పించాడు…

అసలు పాయింట్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని చోట్ల మంచి స్క్రీన్ ప్లే రాసుకుని ఇంటర్వెల్ ఎపిసోడ్ తో మెప్పించిన తర్వాత సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అవుతుందేమో అనుకున్న టైంలో ఇంటరెస్టింగ్ సీన్స్ ని, హనుమంతుడిని గుర్తు చేసే సీన్స్ తో గూస్ బంప్స్ తెప్పించాడు…ఇక క్లైమాక్స్ పోర్షన్ మొత్తం ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తీసి…

అప్పటి వరకు కథ బాగున్నా పెద్దగా వావ్ అనిపించేలా సీన్స్ కొన్నే పడటంతో అసలు సిసలు సీన్స్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి లాస్ట్ 10 నిమిషాలు విజువల్ వండర్ అనిపించే సీన్స్ తో సినిమా ఎండ్ అయ్యే టైంకి ఏం సినిమా రా బాబు అదిరిపోయింది అనిపిస్తూ థియేటర్స్ బయటికి వచ్చేలా చేశాడు…

మొత్తం మీద సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా కామెడీ సీన్స్ వైజ్ వర్కౌట్ అవ్వడం, కొన్ని చోట్ల ఎలివేషన్స్ ఎక్స్ లెంట్ గా ఉండటం, హనుమంతుడి చుట్టూ అల్లుకున్న సీన్స్ బాగుండటం, క్లైమాక్స్ పోర్షన్ ఎక్స్ లెంట్ గా ఉండటం మేజర్ ప్లస్ పాయింట్స్… కథ ఈజీగా గెస్ చేసేలా ఉండటం, కథ కొన్ని చోట్ల ఫ్లాట్ గా ఉండటం లాంటివి డ్రా బ్యాక్స్…

అయినా కానీ ముందే చెప్పినట్లు ఆడియన్స్ అంచనాలను క్లైమాక్స్ కి వచ్చేసరి అందుకోవడమే కాదు మించిపోయే హనుమాన్ మూవీ తర్వాత పార్ట్ కోసం ఎదురు చూసేలా చేయడం ఖాయం. మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here