Home న్యూస్ గుంటూరు కారం…గ్లిమ్స్ రివ్యూ…రికార్డులు జాతర ఖాయం!

గుంటూరు కారం…గ్లిమ్స్ రివ్యూ…రికార్డులు జాతర ఖాయం!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో భారీ ఎత్తున రూపొందుతున్న మూడో సినిమా అఫీషియల్ టైటిల్ ని ఇప్పుడు కన్ఫాం చేశారు. ముందు లీక్ అయినట్లే సినిమా టైటిల్ గుంటూరు కారం గా కన్ఫాం చేయగా సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్బంగా సినిమా అఫీషియల్ టైటిల్ గ్లిమ్స్ ని కూడా రిలీజ్ చేయడం విశేషం అని చెప్పాలి.

ఈ గ్లిమ్స్ చూస్తుంటే మహేష్ ఊరమాస్ లుక్ లో దుమ్ము దులిపేయగా బీడీ కాల్చుతూ మాస్ లుక్ లో మాస్ డైలాగ్స్ తో తన మాస్ స్వాగ్ తో సూపర్ స్టార్ రాంపేజ్ గ్లిమ్స్ మొత్తం హైలెట్ గా నిలిచింది. మహేష్ మాస్ లుక్ కి ఏమాత్రం తీసిపోని విధంగా…

తమన్ ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో రెచ్చిపోగా త్రివిక్రమ్ కూడా తన మాస్ టేకింగ్ తో మెప్పించాడు. ఓవరాల్ గా గ్లిమ్స్ అండ్ టైటిల్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి అనే చెప్పాలి. మహేష్ రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బానే పెర్ఫార్మ్ చేసినా అందరి అంచనాలను అయితే అందుకోలేదు…

కానీ ఇప్పుడు త్రివిక్రమ్ తో చేస్తున్న గుంటూరు కారం పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఔట్ అండ్ ఔట్ మాస్ కమర్షియల్ మూవీగా వచ్చే సంక్రాంతికి రాబోతుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని చెప్పాలి. ఇక గ్లిమ్స్ కి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here