పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu Movie)ఈ సమ్మర్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద మంచి అంచనాలు ఉండగా ఎప్పటి నుండో డిలే అవుతూ రావడంతో బజ్ అయితే తగ్గుతూ వచ్చింది కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందరినీ ఆశ్యర్యపరిచే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి.
ఆల్ రెడీ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమా నుండి రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు. కొల్లగొట్టినాదిరో అంటూ ఫోల్క్ లిరిక్ తో తెరకెక్కిన ఈ సాంగ్ ఫస్ట్ టైం విన్నప్పుడే బాగా ఎక్కేసేలా ఆకట్టుకుంది అని చెప్పాలి….
సాంగ్ లో పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ సింపుల్ స్టెప్స్, అలాగే నిధి అగర్వాల్ లుక్స్ బాగా మెప్పించగా కీరవాణి అందించిన సంగీతం అండ్ ట్యూన్ కూడా క్యాచీగా మెప్పించింది అని చెప్పాలి. దాంతో సాంగ్ ఫస్ట్ టైం విన్నప్పుడే ఎక్కేసేలా ఆకట్టుకోగా…సినిమా కి ఇప్పుడు మరింత హైప్ ను కూడా పెంచడానికి…
ఈ సాంగ్ హెల్ప్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…ఓవరాల్ గా కొంత టైం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమా అవ్వడం, అది కూడా డిప్యూటీ సిఎమ్ అయిన తర్వాత ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఫస్ట్ మూవీ ఇదే అవ్వడంతో ఇప్పుడు బజ్ అనుకున్న రేంజ్ లో లేకున్నా కూడా…
ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత పవర్ స్టార్ మాస్ రాంపెజ్ ను చూపించే అవకాశం ఎంతైనా ఉండగా, సినిమా సాంగ్స్ కూడా బజ్ పెరిగేలా చేస్తూ ఉండటం విశేషం. ఇక సాంగ్ కి 24 గంటల్లో ఓవరాల్ గా ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి ఇప్పుడు.