యంగ్ హీరో రామ్ నటించిన లేటెస్ట్ మూవీ హెలొ గురు ప్రేమ కోసమే బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో 17.6 కోట్ల షేర్ ని అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో మొదటి మూడు రోజుల కలెక్షన్స్ తో సినిమా మొత్తం మీద 19.2 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమా ఆదివారం రోజున అల్టిమేట్ లెవల్ లో గ్రోత్ ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గస సత్తా చాటింది.
దాంతో మొత్తం మీద రెండు రాష్ట్రాలలో సినిమా 80 లక్షల దాకా షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 90 లక్షల లోపు షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. దాంతో టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజులకి గాను 20.1 కోటి షేర్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా….
టోటల్ గా గ్రాస్ 35 కోట్ల మార్క్ ని అందుకుంది. కానీ సినిమాను 24 కోట్లకు అమ్మడంతో 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మరో 5 కోట్ల లోపు వసూళ్లు రాబడితేనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుంది… వర్కింగ్ డేస్ అలాగే దీపావళి హాలీడేస్ ఈ సినిమాకి కీలకం అని చెప్పాలి.