బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లరోడు అల్లరి నరేష్ క్లీన్ హిట్ కొట్టి ఎన్నో ఏళ్ళు అయింది, అప్పుడెప్పుడో 2012 టైం లో సుడిగాడు సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ విజయాన్ని నమోదు చేసుకున్న అల్లరి నరేష్ తర్వాత 9 ఏళ్లలో ఒక్క సారి కూడా క్లీన్ హిట్ మార్క్ ని అందుకోలేక పోయాడు, ఈ ఇయర్ కూడా ముందు బంగారు బుల్లోడు సినిమా తో కంబ్యాక్ ఇస్తాడు అనుకున్నా కానీ దెబ్బ పడగా…
ఎట్టకేలకు ప్రయోగాత్మక సినిమా అయిన నాంది సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు అల్లరి నరేష్, ఎక్స్ పెరి మెంటల్ మూవీ అయినా అల్లరి నరేష్ ఫ్లాఫులలో ఉన్నా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ ను మించి….
ఓవరాల్ గా ఫైనల్ రన్ లో 5.13 కోట్ల వరకు షేర్ ని దక్కించుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ కలెక్షన్స్ ని మిగిలిన సినిమాల కలెక్షన్స్ తో పోల్చితే తక్కువే అనిపించినా ఫ్లాఫులలో ఉన్న టైం లో కంబ్యాక్ కి ఉపయోగ పడ్డాయి. అలాంటి ఈ సినిమా తెలుగు లో కలెక్షన్స్ పరంగా…
తక్కువే అనిపించినా రీసెంట్ గా సినిమా హిందీ రైట్స్ ని ఊహకందని రేటు కి అమ్మారు. తెలుగు లో 5 కోట్ల కలెక్షన్స్ నే కష్టపడి లాంగ్ రన్ లో సొంతం చేసుకున్న ఈ సినిమా హిందీ రైట్స్ మాత్రం ఏకంగా 11 కోట్ల రేటు కి అమ్ముడు పోయినట్లు సమాచారం. దిల్ రాజు ఈ సినిమాను హిందీ లో అజయ్ దేవగన్ తో కలిసి…
కొత్త యాక్టర్స్ తో నిర్మించబోతున్నారట. హిందీ రైట్స్ గంపగుత్తుగా 11 కోట్ల కి అమ్మగా ఇప్పుడు హిందీ లో కంటెంట్ ఉన్న సినిమాలకు రీచ్ సాలిడ్ గా ఉంటుంది కాబట్టి ఈ సినిమా విషయం లో తెలుగు లో వచ్చిన టాక్ నే సొంతం చేసుకుంటే మినిమమ్ 50 కోట్లకి తగ్గని కలెక్షన్స్ ని కొత్త వాళ్ళతో అయినా ఈజీగా సాధిస్తుందని ఫుల్ నమ్మకంగా ఉన్నారట.