Home న్యూస్ రికార్డ్ కొట్టిన చిన్న సినిమా…టాలీవుడ్ ట్రైలర్స్ లో న్యూ రికార్డ్ కొట్టిన ‘హీరో’

రికార్డ్ కొట్టిన చిన్న సినిమా…టాలీవుడ్ ట్రైలర్స్ లో న్యూ రికార్డ్ కొట్టిన ‘హీరో’

0

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న కొత్త సినిమా ‘హీరో’, షూటింగ్ ను ఎప్పుడో పూర్తీ చేసుకున్నా కానీ ఆడియన్స్ ముందుకు రావడానికి సరైన టైం కోసం ఎదురు చూస్తున్న ఈ సినిమా కి పాన్ ఇండియా మూవీస్ అన్నీ కూడా సంక్రాంతి రేసు నుండి తప్పుకోవడం కలిసి రావడంతో సడెన్ గా సినిమాను సంక్రాంతికి అనౌన్స్ చేయగా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఈ నెల 15 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. కాగా ట్రైలర్ లో అసలు సినిమా స్టొరీ పాయింట్ ఏంటి అనేది కూడా ఏమి అర్ధం కాక పోగా హీరో కన్నా కూడా ఎక్కువగా సైడ్ అన్నీ కూడా….

ట్రైలర్ లో ఎక్కువగా హైలెట్ అయినట్లు అనిపించింది, హీరో కూడా ట్రైలర్ ఉన్న కొన్ని షాట్స్ వరకు పర్వాలేదు అనిపించుకున్నాడు కానీ సినిమాలో ఎలా యాక్ట్ చేస్తాడో చూడాలి. ఇక ఈ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి 24 గంటలను పూర్తీ చేసుకోగా టాలీవుడ్ లో కొత్త రికార్డులను…

నమోదు చేసి సంచలనం సృష్టించింది ఈ ట్రైలర్… టాలీవుడ్ లో డెబ్యూ హీరోల సినిమాల ట్రైలర్స్ పరంగా అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న ట్రైలర్ గా ఈ సినిమా ట్రైలర్ బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది, ఇది వరకు ఉప్పెన సినిమా ట్రైలర్ 5.12 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ కొట్టగా… ఆ రేంజ్ లో బజ్ అయితే లేదు కానీ రికార్డ్ విషయం లో మాత్రం…

24 గంటలు పూర్తీ అయ్యే టైం కి 7.32 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసి ఓవరాల్ టాలీవుడ్ లో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వ్యూస్ ని సాధించిన ట్రైలర్ లో ఒకటిగా నిలిచింది. ఇక లైక్స్ పరంగా 24 గంటల్లో 115.7K లైక్స్ తో రికార్డ్ ఏమి అందుకోలేదు. కానీ వ్యూస్ పరంగా మాత్రం సంచలనం సృష్టించింది ఈ సినిమా… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here